కరోనాను జయించిన అభిషేక్ బచ్చన్‌

బాలీవుడ్‌ నటుడు అభిషేక్ బచ్చన్‌ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.

కరోనాను జయించిన అభిషేక్ బచ్చన్‌

Edited By:

Updated on: Aug 08, 2020 | 3:04 PM

Abhishek Bachchan tests negative for Covid-19: బాలీవుడ్‌ నటుడు అభిషేక్ బచ్చన్‌ కరోనాను జయించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ”మీకు ఇచ్చిన మాట ప్రకారమే కరోనాను జయించా. ఈ మధ్యాహ్నం నాకు కరోనా నెగిటివ్‌గా తేలింది. మీ అందరి ప్రార్థనలకు చాలా థ్యాంక్స్‌. ఇంటికి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పట్ల మంచి కేర్ తీసుకున్న నానావతి ఆసుపత్రి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందికి రుణపడి ఉంటాను. కరోనాను జయించేందుకు నాకు సాయం చేసిన నా కుటుంబానికి థ్యాంక్స్”‌ అని అభిషేక్ ట్వీట్ చేశారు.

కాగా బచ్చన్ ఫ్యామిలీలో జయా బచ్చన్‌ మినహా అమితాబ్‌, అభిషేక్‌, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా సోకింది. వీరిలో ఐశ్వర్య, ఆరాధ్య త్వరగానే కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. ఆ తరువాత ఇటీవల అమితాబ్‌కి నెగిటివ్ రావడంతో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 29 రోజుల తరువాత అభిషేక్ కూడా కోలుకోవడంతో… అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read This Story Also: రానా పెళ్లికి హాజరుకానున్న చెర్రీ, శర్వా!