RRR: పాన్‌ ఇండియా చిత్రాలకు ఆయనే కారణం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఆమిర్‌ ఖాన్‌ వ్యాఖ్యలు..

|

Mar 21, 2022 | 6:44 AM

RRR: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రమోషన్స్‌లో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దుబాయ్‌లో మొదలైన ఈ సినిమా ప్రమోషన్స్‌, కర్ణాటకలో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో ఊపందుకుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ (Ramcharan), ఎన్టీఆర్‌ (NTR)తో సహా...

RRR: పాన్‌ ఇండియా చిత్రాలకు ఆయనే కారణం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఆమిర్‌ ఖాన్‌ వ్యాఖ్యలు..
Follow us on

RRR: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రమోషన్స్‌లో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దుబాయ్‌లో మొదలైన ఈ సినిమా ప్రమోషన్స్‌, కర్ణాటకలో జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో ఊపందుకుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ (Ramcharan), ఎన్టీఆర్‌ (NTR)తో సహా చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రెస్‌మీట్‌లు నిర్వహిస్తూ గతంలో ఏ సినిమాకు లేని విధంగా ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆర్‌ఆర్‌ఆర్‌ టీఎమ్‌ ఢిల్లీలో సందడి చేసింది. ఢిల్లీలోని పీవీఆర్‌ఆర్‌ఆర్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర యూనిట్‌ పాల్గొంది.

ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమిర్‌.. దర్శక ధీరుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి కారణంగానే ఇప్పుడు సినిమాలు పాన్‌ ఇండియా తెరకెక్కుతున్నాయని అన్నారు. రాజమౌళి బాహుబలితో భారతీయ స్థాయిని పెంచారని ప్రశంసించారు. ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలిగా ఏదైనా నేర్చుగోలరని కొనియాడారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సిఇనమా కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు అమీర్‌.

ఇదిలా ఉంటే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. భారతీయ భాషలతోనే కాకుండా పలు విదేశీ బాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రీమియర్స్‌ రూపంలో ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. మరి విడుదల తర్వాత ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Sajjanar: అక్కడికి ఆర్టీసీ బస్ వేయండి.. నెటిజన్ ట్వీట్ కు స్పందించిన సజ్జనార్

Russia Ukraine War:ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం.. రష్యా మూలాలకు గట్టి షాక్!