AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలిసొచ్చిన హీరోయిన్‌తో ఆది పినిశెట్టి ప్రేమాయణం..!

దక్షిణాదిన మోస్ట్‌ బ్యాచులర్‌ హీరోల లిస్ట్‌లో ఆది పినిశెట్టి ఒకరు. 37 సంవత్సరాలున్న ఈ హీరో పెళ్లెప్పుడు చేసుకుంటారా..? అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇ

కలిసొచ్చిన హీరోయిన్‌తో ఆది పినిశెట్టి ప్రేమాయణం..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 17, 2020 | 9:54 AM

Share

దక్షిణాదిన మోస్ట్‌ బ్యాచులర్‌ హీరోల లిస్ట్‌లో ఆది పినిశెట్టి ఒకరు. 37 సంవత్సరాలున్న ఈ హీరో పెళ్లెప్పుడు చేసుకుంటారా..? అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇక తన పెళ్లిపై గత మూడు సంవత్సరాలుగా పలు ఇంటర్వ్యూలలో స్పందించిన ఆది.. అన్నీ కుదిరితే త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ పెళ్లి వార్తను మాత్రం ఈ హీరో ఇంతవరకు చెప్పలేదు. కాగా ఈ హీరో ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించిన నిక్కీ గర్లానీ(హీరోయిన్ సంజన సోదరి), ఆది ప్రేమలో ఉన్నట్లు పలు మార్లు పుకార్లు వచ్చాయి. వీరిద్దరు మలుపు, మరకతమణి చిత్రాల్లో నటించగా.. అవి రెండు మంచి విజయాన్ని సాధించాయి. ఆ క్రమంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డట్లు టాక్ నడిచింది. ఇక వీటన్నింటికి బలం చేకూరుస్తూ.. ఇటీవల ఆది ఫ్యామిలీ ఫంక్షన్‌లో భాగమైంది నిక్కీ. ఆది పినిశెట్టి తండ్రి, ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ వేడుకకు ఎవరినీ పిలవలేదు. అయితే ఈ కార్యక్రమంలో నిక్కీ భాగమైంది. బర్త్‌డే వేడుకలకు సంబంధించి ఆది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలలో నిక్కీ కూడా ఉంది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు మరోసారి రుజువైంది. మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప’లో ఆది కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా ఫాలో
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా ఫాలో
కేవలం మొబైల్ ఉంటే చాలు.. ఏఐ (AI) తో ఇంటి నుండే లక్షల సంపాదన
కేవలం మొబైల్ ఉంటే చాలు.. ఏఐ (AI) తో ఇంటి నుండే లక్షల సంపాదన
పోలీసుల అత్యుత్సాహం,యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది
పోలీసుల అత్యుత్సాహం,యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది
అమావాస్య రోజున ఏం తినాలి? ఏం తినకూడదు? సోమవతి అమావాస్య నియమాలు..
అమావాస్య రోజున ఏం తినాలి? ఏం తినకూడదు? సోమవతి అమావాస్య నియమాలు..
రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు..
రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు..
అసలైన భద్రతా ప్రమాణాన్ని మాత్రం గాలికొదిలేశారు...
అసలైన భద్రతా ప్రమాణాన్ని మాత్రం గాలికొదిలేశారు...
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, శాలరీ పెరగుదల ఎప్పుడు ప్రకటిస్తారు?
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, శాలరీ పెరగుదల ఎప్పుడు ప్రకటిస్తారు?
రాత్రి పూట అస్సలే చేయకూడని పనులివే.. చేస్తే అశుభమే..
రాత్రి పూట అస్సలే చేయకూడని పనులివే.. చేస్తే అశుభమే..
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో లేటెస్ట్ అప్ డేట్స్..
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో లేటెస్ట్ అప్ డేట్స్..
ఈశాన్యంలో నీటి చెంబు ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం అష్టైశ్వర్యాలకు
ఈశాన్యంలో నీటి చెంబు ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం అష్టైశ్వర్యాలకు