AA19 Title: చెక్కు చెదరని ‘అ’ సెంటిమెంట్.. బన్నీ మూవీకి కలిసొచ్చే టైటిల్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇవాళ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తనకు కలిసొచ్చిన ‘అ’ సెంటిమెంట్‌తోనే ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ను పెట్టాడు. ఇక టైటిల్‌తో పాటు అల్లు అర్జున్‌ లుక్‌కు సబంధించిన ఒక చిన్న వీడియోను, డైలాగ్‌ను రిలీజ్ చేశారు. అందులో ‘‘ఏంట్రా గ్యాప్ ఇచ్చావు’’ అని మురళీ శర్మ బన్నీని అడగగా.. ‘‘ఇవ్వలా.. […]

AA19 Title: చెక్కు చెదరని ‘అ’ సెంటిమెంట్.. బన్నీ మూవీకి కలిసొచ్చే టైటిల్

Edited By:

Updated on: Aug 15, 2019 | 11:30 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇవాళ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తనకు కలిసొచ్చిన ‘అ’ సెంటిమెంట్‌తోనే ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ను పెట్టాడు. ఇక టైటిల్‌తో పాటు అల్లు అర్జున్‌ లుక్‌కు సబంధించిన ఒక చిన్న వీడియోను, డైలాగ్‌ను రిలీజ్ చేశారు. అందులో ‘‘ఏంట్రా గ్యాప్ ఇచ్చావు’’ అని మురళీ శర్మ బన్నీని అడగగా.. ‘‘ఇవ్వలా.. వచ్చింది’’ అంటూ తన మీద తానే సెటైర్ వేసుకున్నాడు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, నివేథా పేతురాజ్, జయరామ్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, రావు రమేష్, సునీల్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.