‘బిగ్‌బాస్ 3’ కోసం ఆ ఐదుగురు..?

| Edited By:

Mar 04, 2019 | 1:42 PM

తెలుగు బుల్లితెరపైన విజయవంతమైన షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఈ సిరీస్‌లో ఇప్పటికి వచ్చిన రెండు సీజన్‌లు వీక్షకులను ఆకట్టుకోగా.. త్వరలో మూడో సీజన్‌ను ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యతగా ఉండబోయే ఈ సీజన్‌ను జూన్ నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ల కోసం సెలబ్రిటీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఐదుగురి పేర్లు ప్రముఖుంగా వినిపిస్తున్నాయి. అందులో వరుణ్ సందేశ్, జేడీ చక్రవర్తి, యాంకర్లు మంజూష, ఉదయభాను, రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడ […]

‘బిగ్‌బాస్ 3’ కోసం ఆ ఐదుగురు..?
Follow us on

తెలుగు బుల్లితెరపైన విజయవంతమైన షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఈ సిరీస్‌లో ఇప్పటికి వచ్చిన రెండు సీజన్‌లు వీక్షకులను ఆకట్టుకోగా.. త్వరలో మూడో సీజన్‌ను ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యతగా ఉండబోయే ఈ సీజన్‌ను జూన్ నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ల కోసం సెలబ్రిటీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఐదుగురి పేర్లు ప్రముఖుంగా వినిపిస్తున్నాయి. అందులో వరుణ్ సందేశ్, జేడీ చక్రవర్తి, యాంకర్లు మంజూష, ఉదయభాను, రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌ను మరింత రసవత్తరంగా చూపించాలనుకుంటోన్న నిర్వాహకులు కంటెస్టెంట్‌లుగా నటులు, గాయకులు, ఫిల్మ్ మేకర్లు అలాగే ఓ ఆటగాడిని కూడా ఎంపిక చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.