
సినిమా అనేది గ్లామర్ వరల్డ్. అందంగా ఉన్న వాళ్లకు మాత్రమే ఇక్కడ అవకాశాలు లభిస్తాయి. అందుకే అందంగా ఫిట్‌నెస్, ఫుడ్‌తోపాటు కొన్నిసార్లు ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటారు సెలబ్రిటీలు. ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. కొన్నేళ్ల నుంచి సర్జరీ చేయించుకుని తమ అందానికి మరిన్ని మెరుగులు దిద్దుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు నేటి తారలు. హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారని టాక్
స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ దానిని మరింత పెంచుకునేందుకు తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న స్టార్లు ఎవరు అనేది తెలుసుకుందాం..
మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న తర్వాత నాసల్ పాలిప్ తొలగించే సర్జరీలో డాక్టర్ మిస్టేక్ చేశారు. దీంతో ముఖం పూర్తిగా మారిపోయింది. దాంతో మూడు సినిమా అవకాశాలు కోల్పోయింది. ‘డీప్ డిప్రెషన్‌లోకి వెళ్లాను. కెరీర్ అయిపోయిందని అనుకున్నాను’ అని ప్రియాంక పలుమార్లు చెప్పింది. తర్వాత కరెక్టివ్ సర్జరీలతో సరిచేసుకుంది.
‘బాంబే వెల్వెట్’ కోసం లిప్ ఎన్‌హాన్స్‌మెంట్ చేయించుకున్న అనుష్కకు పెదాలు పఫ్ఫీగా మారాయి. కాఫీ విత్ కరణ్ షోలో కనిపించినప్పుడు భారీ ట్రోలింగ్ ఎదురైంది. తర్వాత “టెంపరరీ టూల్ వాడాను” అని చెప్పినా, లిప్ జాబ్ అని అందరూ అనుకున్నారు.
‘వాంటెడ్’ బ్యూటీ ఐషా లిప్ ఫిల్లర్స్, చీక్ ఎన్‌హాన్స్‌మెంట్స్ చేయించుకుంది. దీంతో పెదాలు అన్‌నేచురల్‌గా పఫ్ఫీ అయ్యాయి. ముఖం పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ ఎదుర్కొంది.
రాఖీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్, లిప్, నోజ్ సర్జరీలు చేయించుకున్నానని ఓపెన్‌గా చెప్పింది. “భగవాన్ ఇవ్వనిది డాక్టర్ ఇచ్చాడు” అని తెలిపింది కూడా. అన్‌నేచురల్ లుక్ వల్ల విమర్శలు ఎదుర్కొంది.
‘సాకి సాకి’ గర్ల్ కోయెనా 2010లో రైనోప్లాస్టీ (నోజ్ సర్జరీ) చేయించుకుంది. సర్జరీ తప్పుగా జరిగి ఎముకలు వాచిపోయాయి, ముక్కు ఆకారం పూర్తిగా మారిపోయింది. మరో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో కెరీర్ దెబ్బతింది. ఇండస్ట్రీ నుంచి దూరమైంది. ఒక ఇంటర్వ్యూలో “3 ఏళ్లు టార్చర్ అనుభవించాను” అని చెప్పింది కోయెనా.
తన ప్లాస్టిక్ సర్జరీల గురించి ఓపెన్‌గా మాట్లాడిన కొద్ది మంది సెలబ్రిటీల్లో ఒకరు శ్రుతి హాసన్. మొదటి సినిమా తర్వాత నోస్ బ్రేక్ అయినందున రైనోప్లాస్టీ చేయించుకుంది. “నా ముక్కు బ్రోకెన్, దాన్ని ప్రెట్టీగా మార్చుకున్నాను. ఇది నా ముఖం, నా ఛాయిస్” అని చెప్పింది. ఫిల్లర్స్ కూడా వాడినట్లు తెలిపింది. చాలామంది ఆమె సర్జరీని సక్సెస్‌ఫుల్‌గా చూస్తారు. మరింత అందంగా కనిపిస్తోందని పొగుడుతారు.
మౌనీ రాయ్ – ఓవర్ ఫిల్లర్స్ & ఇతర ప్రొసీజర్స్
టీవీ నుంచి బాలీవుడ్‌కు వచ్చిన మౌనీ రాయ్ రూపంలో మార్పు గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. లిప్ ఫిల్లర్స్, చీక్ ఎన్‌హాన్స్‌మెంట్, బోటాక్స్ ఎక్కువ చేయించుకున్నట్లు రూమర్స్ ఉన్నాయి. ముందు సింపుల్ లుక్‌లో ఉండేది. ఇప్పుడు అన్‌రికగ్నైజబుల్‌గా మారిందని ట్రోలింగ్ ఎదురవుతుంటాయి. మౌనీ ఈ ఆరోపణలను డినై చేస్తుంది.
ప్రీతి జింటా – బోటాక్స్ & ఇతర ఎన్‌హాన్స్‌మెంట్స్
డింపుల్ బ్యూటీ ప్రీతి జింటా బోటాక్స్, ఫేస్ లిఫ్ట్, చీక్ ఫిల్లర్స్ చేయించుకున్నట్లు రూమర్స్ ఉన్నాయి. ముందు బబ్లీ లుక్‌లో ఉండేది. ఇప్పుడు ముఖం టైట్‌గా, అన్‌నేచురల్‌గా కనిపిస్తోందని ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది ఈ బ్యూటీ. కాఫీ విత్ కరణ్‌లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వారిలో తుషార్ కపూర్ ఆమె పేరు చెప్పిన సంఘటన వివాదాస్పదమైంది. అయితే ప్లాస్టిక్ సర్జరీ రూమర్లను ప్రీతి జింటా ప్రతిసారీ డినై చేస్తుంది.