పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తికాగా…రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 1న జరగనుంది. అధికార తృణాముల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొంటోంది. ప్రచారఘట్టంలో పైచేయి సాధించేందుకు ఇరు పార్టీలు సోషల్ మీడియా వేదికగానూ పరస్పరం విరుచుకపడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు తమకు దక్కిన ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తృణాముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్‌కు సంబంధించిన ఓ వీడియో బీజేపీ చేతిలో అస్త్రంగా మారింది. ఈ వీడియోలో నుస్రత్ జహాన్ నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో సహనాన్ని కోల్పోయి దురుసుగా వ్యవహరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. గంటకుపైగా ఎన్నికల ప్రచారం నిర్వహించలేనంటూ నుస్రత్ అసహనం వ్యక్తంచేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సీఎం కోసం కూడా ఇంతకు మించి చేయలేనంటూ ఆమె ప్రచార వాహనంపై నుంచి కిందకు దిగేశారు.
TMC MP Nusrat Jahan ” I can’t do rally for more than 1 hour, I don’t even do it for CM”? #MamataLosingNandigram pic.twitter.com/p0jOm4iy03
— BJP Bengal (@BJP4Bengal) March 28, 2021
సమీపంలోని మెయిన్ రోడ్డు వరకు ప్రచారాన్ని కొనసాగించాలన్న స్థానిక టీఎంసీ నేతల అభ్యర్థనను నుస్రత్ జహాన్ తిరస్కరిస్తున్నట్లు ఈ వీడియోలు ఉంది. 25 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసింది. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోతున్నారంటూ బీజేపీ కామెంట్ చేసింది. నుస్రత్ జహాన్ వ్యవహార తీరుకు సంబంధించిన ఈ వీడియో..తృణాముల్‌ను ఇబ్బందిపెట్టేందుకు బీజేపీ చేతిలో ప్రచారాస్త్రంగా మారింది. దీనిపై తృణాముల్ కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందో వేచిచూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సిత్రాలు.. 25శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
నందిగ్రామ్ లో రెండు బలమైన ‘కొండలను’ ఢీకొననున్న చిట్టి అభ్యర్థి, వయస్సు 36 ఏళ్ళే !