Congress releases campaigners list: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రాష్ట్రంలో పోరు హోరాహోరిగా మారింది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మాటల తూటాలతో.. ప్రత్యేక్ష దాడులతో దూసుకుపోతున్నాయి. ఈ నెల 27న తొలిదశ పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి బీజేపీ ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా శుక్రవారం 30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అధిష్టానంపై ఇటీవల గళమెత్తిన నేతలకు చోటు కల్పించకపోవడం గమనార్హం. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాందీ ఉన్నారు.
వీరితో పాటు ఈ జాబితాలో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మల్లిఖార్జున్ ఖర్గే, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, చత్తీస్ఘడ్ సీఎం భూపేష్ బాగేల్, అధిర్ రంజన్ చౌదరీ, రాజస్తాన్ మాజీ సీఎం సచిన్ పైలట్, నవజోత్ సింగ్ సిద్ధూ, అభిజిత్ ముఖర్జీ, మహ్మద్ అజారుద్దీన్, అధీర్ రంజన్ చౌధరి, కమల్ నాథ్, సల్మాన్ ఖుర్షీద్, ఆర్పీఎన్ సింగ్, సుర్జేవాలా, జితిన్ ప్రసాద్, దీపా దాస్‌మున్షీ, దీపేంద్ర హుడా, అఖిలేష్ సింగ్, పవన్ ఖేరా, బీపీ సింగ్ తదితరుల పేర్లున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఎన్నికల సంఘానికి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను అందించారు.
Congress releases list of 30 star campaigners for West Bengal. Party’s interim chief Sonia Gandhi, ex-PM Dr Manmohan Singh & party leaders Rahul Gandhi, Priyanka Gandhi Vadra, Sachin Pilot, Navjot Singh Sidhu, Abhijit Mukherjee and Mohd Azharuddin included.#WestBengalElections pic.twitter.com/3BuMssL0aw
— ANI (@ANI) March 12, 2021
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో 8 విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికలు మార్చి 27న.. చివరి విడుత ఏప్రిల్ 29న జరుగనున్నాయి.
పోలింగ్ తేదీలు..
తొలి విడత: మార్చి 27
రెండో విడత: ఏప్రిల్ 1
మూడో విడత: ఏప్రిల్ 6
నాలుగో విడత: ఏప్రిల్ 10
ఐదో విడత: ఏప్రిల్ 17
ఆరో విడత: ఏప్రిల్ 22
ఏడో విడత: ఏప్రిల్ 26
ఎనిమిదో విడత: ఏప్రిల్ 29
Also Read: