UP Elections: బీజేపీ నేతృత్వంలోని NDA తరుఫున బరిలోకి దిగుతున్న మొదటి ముస్లిం అభ్యర్థి

|

Jan 24, 2022 | 8:51 AM

Hyder Ali Khan: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేశాయి. బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్ (ఎస్) తన మొదటి అధికారిక అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది.

UP Elections: బీజేపీ నేతృత్వంలోని NDA తరుఫున బరిలోకి దిగుతున్న మొదటి ముస్లిం అభ్యర్థి
Hyder Ali Khan
Follow us on

Uttar Pradesh Assembly election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేశాయి. భారతీయ జనతా పార్టీ(BJP) మిత్రపక్షమైన అప్నా దళ్ (ఎస్)(Apnadal(S) తన మొదటి అధికారిక అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో హైదర్ అలీ ఖాన్(Hyder Ali Khan) పేరు ప్రకటించింది. అతను సువార్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(NDA) ద్వారా హైదర్ అలీఖాన్‌ను మొదటి ముస్లిం అభ్యర్థిగా నిలబెట్టింది. గత వారం అప్నాదళ్ (ఎస్), నిషాద్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాంపూర్ జిల్లాలోని సువార్‌లో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజంపై హైదర్ అలీఖాన్ పోటీ చేసే అవకాశం ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అబ్దుల్లా ఆజం.. సువార్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, 2019లో, అలహాబాద్ హైకోర్టు అతను తన నామినేషన్ దాఖలు చేసినప్పుడు కనీస వయస్సు 25 ఏళ్లు కానందున అతని ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది.


హైదర్ అలీ ఖాన్ ఎవరు?
హైదర్ అలీ ఖాన్ కాంగ్రెస్ నాయకుడు నవాబ్ కాజిమ్ అలీ ఖాన్ కుమారుడు. ఇతనుపొరుగున ఉన్న రాంపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేయనున్నారు. అంతకుముందు జనవరి 13న సువార్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా హైదర్ అలీఖాన్‌ను ప్రకటించగా.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో అప్నాదళ్ (ఎస్)లో చేరారు. ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పార్టీని వీడిన రెండవ కాంగ్రెస్ అభ్యర్థి హైదర్ అలీ ఖాన్ కావడంవిశేషం. మొదట బరేలీ కంటోన్మెంట్ నుండి పార్టీ అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్ట్ సుప్రియా అరోన్ ప్రకటించింది కాంగ్రెస్.శనివారం బరేలీ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సుప్రియా అరోన్ లక్నోలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్ వాదీ పార్టీలో చేరారు. తన కొడుకు కాంగ్రెస్‌ను విడిచిపెట్టడంపై హైదర్ తండ్రి నవాబ్ కాజిమ్ అలీ ఖాన్ మాట్లాడుతూ..”నేను ఇప్పటికీ రాంపూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థినే. అలాగే, పార్టీని వీడే ఆలోచన లేదు.

హైదర్ అలీఖాన్ ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్‌లో చదివి తదుపరి చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. గతంలో తన తండ్రి కోసం ఎన్నికల పనులు నిర్వహించాడు. కాంగ్రెస్‌ నుంచి ఎన్‌డీఏలోకి మారిన సందర్భంగా హైదర్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ.. ‘మా పార్టీ నాయకురాలు అనుప్రియా పటేల్‌ పోరాటంతో నేను స్ఫూర్తి పొందాను. గత ఐదేళ్లలో యూపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. మా కుటుంబం నిర్మించిన వంతెన విరిగిపోయింది. డబ్బు కోసం ఆజం ఖాన్ ద్వారా. దానిని ఈ ప్రభుత్వం మరమ్మతులు చేస్తోంది. ఇది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను నగరానికి కలుపుతుంది.” యూపీలోని ముస్లింలకు అన్ని పథకాల ప్రయోజనాలు చేరాయని, ముస్లింలు ఎన్డీయేకు మద్దతిస్తారని ఆయన అన్నారు.

అజం vsనవాబ్ కుటుంబ కలహాలు
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ ‘రాంపూర్ నవాబ్‌లతో’ సుదీర్ఘంగా వైరం కొనసాగుతోంది. రెండు కుటుంబాలకు చెందినవారు వ్యతిరేకంగా అనేక ఎన్నికలను ఎదుర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టారు. ఈ సందర్భంలో సువార్‌లో జరిగే ఎన్నికల్లో అబ్దుల్లా ఆజం వర్సెస్ హైదర్ అలీఖాన్ మధ్య ప్రత్యక్షంగా తలపడబోతున్నారు.

ఇదిలావుంటే, ఇటీవలే, అబ్దుల్లా ఆజం బెయిల్ పొంది సీతాపూర్ జైలు నుండి బయటకు వచ్చారు. అయితే, అతని తండ్రి అతనిపై అనేక కేసులకు సంబంధించి ఇప్పటికీ కటకటాల వెనుక ఉన్నారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

Read Aslo…  Arunachal Tunnel: అరుణాచల్‌లో చైనా ఆగడాలకు త్వరలో చెక్‌.. కీలక దశకు బోర్డర్‌ సెక్యూరిటీ ప్రాజెక్ట్!