తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికః బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభ పేరు ఖరారు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభను ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికః బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభ పేరు ఖరారు
Tirupati Bjp Candidate Ratna Prabha Ias

Updated on: Mar 26, 2021 | 6:39 AM

Ratna Prabha IAS: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభను ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్‌‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన రత్నప్రభను ఎన్నికల బరిలోకి దింపుతోంది. గతంలో కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా కూడా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. కాగా, అధికార వైసీపీ నుంచి డాక్టర్‌ గురుమూర్తిని రంగంలోకి దింపుతోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కరోనాతో మరణించారు. ఆయన అకాలమరణంతో తిరుపతి లోక్‌సభకు ఎన్నిక అనివార్యమైంది.

కాగా, తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బీజేపీలో ప్రధానంగా నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. నలుగురిలో రిటైర్డు ఐఏఎస్‌ అధికారులు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ, రిటైర్డు డీజీపీ కృష్ణప్రసాద్‌ వుండగా మరొకరు తిరుపతి బీజేపీ నేత మునిసుబ్రమణ్యం వున్నారు. తిరుపతి ప్రధానంగా విద్యా కేంద్రం కావడంతో ఇక్కడ ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉంటారు. అలాగే, నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలోనూ విద్యావంతులు అధికంగా వుంటున్నారు. ఈ కారణంగానే ఇక్కడ ఏ పార్టీ అయినా విద్యాధికులనే అభ్యర్థులుగా ఎంచుకుంటున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి బీజేపీ నుంచే బరిలోకి దించుతున్నారు.

ఇప్పటికే ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అందరికంటే ముందుగా టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ అభ్యర్థిగా తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ ఎం.గురుమూర్తి పేరును సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటించారు. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు.. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి సెగ్మెంట్లు ఉన్నాయి. పనబాక లక్ష్మీ ఇప్పటికే నామినేషన్ వేయగా.. గురుమూర్తి ఈనెల 29న నామినేషన్ వేయనున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ముందుండటంతో బీజేపీ అందుకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఏప్రిల్ 17న తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక జరగనుండగా.. మే 2న ఫలితాలను వెల్లడిస్తారు.

Read Also… Fire Breaks out in Hospital: మహారాష్ట్రలో దారుణం.. కోవిడ్ కేర్ హాస్పిటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహం..