Tamil Nadu Kerala Puducherry Exit Poll Results 2021 Highlights: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఎగ్జిట్‌ ఫోల్స్‌ ఫలితాలు

|

Apr 29, 2021 | 10:48 PM

Tamil Nadu Kerala Puducherry elections exit Poll Results 2021: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక పశ్చిమబెంగాల్‌లో ఈ రోజు...

Tamil Nadu Kerala Puducherry Exit Poll Results 2021 Highlights: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఎగ్జిట్‌ ఫోల్స్‌ ఫలితాలు

Tamil Nadu Kerala Puducherry elections exit Poll Results 2021: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక పశ్చిమబెంగాల్‌లో ఈ రోజు చివరి దశ పోలింగ్‌ ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో ఏయే పార్టీలకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.? ఏ పార్టీ విజయం సాధిస్తుంది.? ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి.? అక్కడి అధికారపక్షం మరోసారి పీఠాన్ని దక్కించుకుంటుందా? లేదా విపక్షాలు విజయం సాధిస్తాయా.? అనేది ఇప్పుడు చర్చ. ఇదిలా ఈ ఐదు రాష్ట్రాలో ఎవరు అధికారం చేపడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌, ఎన్‌డీఏ, ఇతరులు బరిలో ఉన్నాయి. ఇందులో ఎవరు గెలుస్తారనేదానిపై చర్చ కొనసాగుతోంది. అయితే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో టీవీ9 ఎగ్జిట్‌పోల్స్‌ ఇలా ఉన్నాయి.

తమిళనాడులో 232 స్థానాలు..

ఏప్రిల్ 6 న తమిళనాడులోని 232 అసెంబ్లీ స్థానాల్లో ఏకకాలంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి ఇక్కడ ఎన్నికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎందుకంటే ఎఐఏడీఎంకె, డీఎంకే పార్టీలకు సారధ్యం వహించిన హేమాహేమీలు.. దివంగత నేతలు జయలలిత, ఎం కరుణానిధి లేకుండానే బరిలోకి దిగాయి. ఎప్పటిలాగానే.. ఇక్కడ ఏఐడీఎంకే, డీఎంకే మధ్య పోటీ నెలకొంది. బీజేపీ ఏఐడీఎంకే జట్టుకట్టగా.. కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీచేశాయి.

కేరళలోని 140 స్థానాలు..

కేరళలో కూడా ఏప్రిల్ 6న 140 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఎల్‌డిఎఫ్ కూటమి… కాంగ్రెస్ మద్దతు గల యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. భారతీయ జనతా పార్టీ కూటమి కూడా గట్టి పోటీనిచ్చింది.

పుదుచ్చేరిలో 30 స్థానాలు..

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ ముగిసింది. ఈసారి బీజేపీ.. కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కాగా.. ఈ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ వి నారాయణస్వామి ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది.

Also Read: West Bengal Exit Poll Results 2021 LIVE: ఉత్త‌రాధిన పాగా వేసేది ఎవ‌రు..? బెంగాల్, అస్సాం ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Apr 2021 09:08 PM (IST)

    కేరళ- టైమ్స్‌ ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌

    ఎల్‌డీఎఫ్‌ 76
    యూడీఎఫ్‌ 61
    బీజేపీ 3

  • 29 Apr 2021 08:54 PM (IST)

    తమిళనాడు – టూడేస్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌

    డీఎంకే – 164-186
    అన్నాడీఎంకే – 46-68
    ఇతరులు – 0-6

  • 29 Apr 2021 08:47 PM (IST)

    తమిళనాడు- సి-ఓటరు ఎగ్జిట్‌ పోల్స్‌

    ఏడీఎంకే – 58-70
    డీఎంకే – 160-172
    ఏఎంఎంకే – 0
    ఇతరులు – 0-7

  • 29 Apr 2021 08:35 PM (IST)

    తమిళనాడు – ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్‌

    డీఎంకే – 175-195
    అన్నాడీఎంకే -38-54
    ఇతరులు – 1-9

  • 29 Apr 2021 08:34 PM (IST)

    అస్సాం ఏఏజే తక్​ ఎగ్జిట్‌ పోల్స్‌

    • బీజేపీ 75-85
    • కాంగ్రెస్​ 40-50
  • 29 Apr 2021 08:27 PM (IST)

    పుదుచ్చేరిలో బీజేపీకి విజయవకాశాలు

    దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఇక పుదుచ్చేరిలో ఉన్న 30 స్థానాల్లో ఎగ్జిల్‌పోల్స్‌ పరిశీలిస్తే బీజేపీకి విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  • 29 Apr 2021 08:12 PM (IST)

    పుదుచ్చేరి – టీవీ9-పోల్‌స్ట్రాట్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు

    కాంగ్రెస్‌ – 11-13
    బీజేపీ – 17-19
    ఏఎంఎకే -0
    ఇతరులు – 0

  • 29 Apr 2021 08:07 PM (IST)

    పుదుచ్చేరి – సిఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు

    కాంగ్రెస్‌ – 11-13
    బీజేపీ – 16-20
    ఏఎంఎంకే -0
    ఇతరులు -0

  • 29 Apr 2021 07:59 PM (IST)

    కేరళ- ఆర్‌ఇండియా-సిఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్ పోల్స్

    ఎల్‌డీఎఫ్‌ – 72-80
    కాంగ్రెస్‌ – 58-64
    బీజేపీ – 1-5
    ఇతరులు – 0

  • 29 Apr 2021 07:55 PM (IST)

    కేరళ – ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు

    ఎల్‌డీఎఫ్‌ – 104-120
    కాంగ్రెస్‌ – 20-36
    బీజేపీ – 0-2
    ఇతరులు – 0

  • 29 Apr 2021 07:53 PM (IST)

    కేరళ – టీవీ 9 ఎగ్జిట్‌ పోల్స్‌

    ఎల్‌డీఎఫ్‌ – 70-80
    కాంగ్రెస్‌ – 59-69
    బీజేపీ – 0-2
    ఇతరులు – 0

  • 29 Apr 2021 07:48 PM (IST)

    తమిళనాడు – సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌

    డీఎంకే – 160-170

    అన్నాడీఎంకే – 58-68

    ఏఎంఎంకే – 4-6

    ఇతరులు – 0

  • 29 Apr 2021 07:45 PM (IST)

    తమిళనాడు – టీవీ 9 ఎగ్జిట్‌ పోల్స్‌

    ఏడీఎంకే – 75-85
    డీఎంకే – 143-153
    ఏఎంఎంకే – 2-12

  • 29 Apr 2021 07:39 PM (IST)

    పుదుచ్చేరి ఎగ్జిట్‌ పోల్స్‌ 2021- రిపబ్లిక్‌ టీవీ

    ఎన్‌డీఏ – 16-20 సీట్లు
    యూపీఏ – 11-13 సీట్లు
    ఇతరులు – 0

  • 29 Apr 2021 07:34 PM (IST)

    రిపబ్లిక్‌ టీవీ – తమిళనాడు ఎగ్జిట్‌ ఫలితాలు

    డీఎంకే – 160-170
    ఏడీఎంకే – 58-68
    ఇతరులు – 0

  • 29 Apr 2021 07:19 PM (IST)

    కొద్ది సేపట్లో రానున్న ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు

    దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పర్వం ముగిసింది. ఈ రోజు పశ్చిమబెంగాల్‌ తుది దశ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరుగగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు కొద్ది సేపట్లో విడుదల కానున్నాయి.

Follow us on