తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కాళ్లకు మొక్కడాన్ని సహించలేకపోతున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇది చూడలేం అన్నారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. ప్రజల చేత ఎన్నికైన ఓ ప్రతినిధి అమిత్ షా కాళ్ళు తాకుతున్న ఓ ఫోటోను తాను చూశానని, బీజేపీ లోనే ఇలా ప్రధాన మంత్రి, లేదా హోం మంత్రి కాళ్లకు ప్రజా ప్రతినిదులు వారి కాళ్లకు మొక్కడాన్ని చూస్తామని అన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రధాని మోదీ కంట్రోల్ చేయడాన్ని తన పాదాలకు మొక్కేలా చూడడాన్నినేను అంగీకరించబోను.. అమిత్ షా ముందు తలొంచడానికి ఈ సీఎం కి ఇష్టం లేకపోయినప్పటికీ.. తను చేసిన అవినీతి వల్ల అలా చేయక తప్పడంలేదు అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇటీవల బీజేపీలో చేరిన ఓ జూనియర్ కాంగ్రెస్ నాయకుడు అమిత్ షాతో దిగిన ఫోటోను చూపారని ఆయన తెలిపారు. ఈ రాష్ట్ర భాషా ఔన్నత్యం, సంస్కృతి చాలా గొప్పవని, అలాంటిది వీరు ఇలా సాగిల పడడంలో యేమాత్రమైనా ఔచిత్యం ఉందా అని రాహుల్ ప్రశ్నించారు.
తమిళ ప్రజలతో తను మమేకం కావాలనుకుంటున్నానని, తమిళ భాష, సంస్కృతి ఇతర సంస్కృతులకన్నా విశిష్టమైనవని ఆయన చెప్పారు. తమిళనాడును ఇండియా అంటే.. ఇండియాయే .తమిళనాడు అన్న విషయాన్ని కూడా అంగీకరించాలి అని రాహుల్ వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ కూటమి (డీఎంకే-కాంగ్రెస్) అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ-ఆర్ఎస్ఎస్ పతనం తప్పదని ఆయన హెచ్ఛరించారు.ఇది తమిళ ఎన్నిక అని, అన్నాడీఎంకే, బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ ఒకవైపు, తమిళ ప్రజలు మరో వైపు అని ఆయన అన్నారు. తమిళనాడు ఇప్పుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోందని, యువత ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. తమిళనాడును తమిళులే పాలించాలి తప్ప ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు అన్నారాయన .
మరిన్ని చదవండి ఇక్కడ:జక్కన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు.. షాకైన చెర్రీ..ఫిదా అవుతున్న నెటిజెన్లు..: Rajamouli Gift For Ram Charan Birthday Video.
టీనేజ్ కూతురితో మజాక్ చేస్తున్న నటి ప్రగతి.. వైరల్ అవుతున్న వీడియో : Actor Pragathi Viral Video.