Tamil Nadu Elections 2021: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వి.కె. శశికళకు ఝలక్ ఎదురైంది. చిన్నమ్మ ఓటు గల్లంతయ్యింది. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో శశికళ పేరు కనిపించలేదు. ఒక్క శశికళ పేరే కాదు. ఆమెతో పాటు.. దివంగత నాయకురాలు జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ భార్య ఇళవరసి ఓటు కూడా గల్లంతయ్యింది. గతంలో పోయెస్ గార్డెన్ చిరునామాతో శశిళకు ఓటు హక్కు ఉంది. అయితే, అక్రమాస్తుల కేసులో అరెస్టైన శశికళ.. నాలుగేళ్ల పాటు బెంగళూరులోని పరప్పణి జైలులో శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే.
నాలుగేళ్లుగా తమిళనాడులో లేకపోవడంతో ఆమె ఓటును అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల జైలు నుంచ విడుదలైన శశికళ.. టి.నగర్ చిరునామాతో ఓటు హక్కుకోసం దరఖాస్తు చేస్తున్నారు. అయితే, తాజాగా విడుదలైన జాబితాలో శశికళ పేరు లేకపోవడంతో ఆమెతో పాటు, ఆమె వర్గం షాక్‌కు గురయ్యారు. కొత్త చిరునామాతో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంపై ఆమె మద్ధతుదారులు మండిపడుతున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం పక్కా కుట్రే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమాస్తుల కేసులో అరెస్టైన శశికళ.. ఇటీవల జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అలా బెంగళూరు నుంచి తమిళనాడుకు వచ్చిన శశికళ.. అడుగు పెడుతూనే రాజకీయ అరంగేట్రంపై సంచలన ప్రకటన చేశారు. జయలలిత వారసురాలిని తానేనని, రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని స్పష్టమైన ప్రకనట చేశారు. ఆమేరకు ప్రయత్నాలు కూడా సాగించారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారుల దాడులు, శశికళ వర్గానికి చెందిన వారి ఆస్తుల జప్తు చేయడం వరుసగా జరిగిపోయాయి. అనేక మలుపులు తిరిగిన రాజకీయాల నేపథ్యంలో చివరికకి తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు శశికళ ప్రకటించారు. కొసమెరుపుగా.. జయలలిత ఆశయ సాధన కోసం అన్నాడీఎంకేని గెలిపించాలని పిలుపునిచ్చారు.
Also read:
AP Corona Cases: ఏపీలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 1,326 పాజిటివ్ కేసులు.. ప్రమాదకరంగా మరణాలు..
Uttarandhra Rains: ఉత్తరాంధ్రను ముంచెత్తిన అకాల వర్షం.. విజయనగరం జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం
Hyderabad: అతని వయసు 48.. ఆమె వయసు 25.. మాయ మాటలతో ట్రాప్ చేశాడు.. చివరికి ఆ అమ్మాయిని…