తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలుః ఓటు హక్కు వినియోగించుకున్న తమిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్

Tamil nadu Assembly Elections 2021: త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న ఓటు హ‌క్కును ఉద‌యమే వినియోగించుకున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలుః ఓటు హక్కు వినియోగించుకున్న తమిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్
Rajanikanth Vote

Updated on: Apr 06, 2021 | 10:12 AM

Tamil Superstar Rajinikanth: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొన‌సాగుతోంది. ఉదయం 7గంటలకు మొదలైన రాత్రి 7గంటల వరకు కొనసాగనుంది. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ బూతులకు తరలివస్తున్నారు. ఇదే క్రమంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న ఓటు హ‌క్కును ఉద‌యమే వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్‌లో ర‌జ‌నీకాంత్ ఓటేశారు.

ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్న ర‌జ‌నీకాంత్.. త‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో ర‌జ‌నీకాంత్ ఎవ‌రికీ మ‌ద్దతు ప్రక‌టించ‌లేదు. ఇక ఇటీవ‌లే కేంద్రం ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రజనీకాంత్.. ఓటర్లను కోరారు.

READ ALSO…Tamil Nadu Assembly Election 2021 voting Live: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్