Khushbu Sundar: డీఎంకే పార్టీ ఓటర్లకు డబ్బులు పంచిపెడుతోంది.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఖుష్బూ

|

Apr 06, 2021 | 1:15 PM

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇక్కడి థౌసండ్ లైట్స్ అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున సినీ నటి ఖుష్బూ పోటీ చేస్తున్నారు.

Khushbu Sundar: డీఎంకే పార్టీ ఓటర్లకు డబ్బులు పంచిపెడుతోంది.. ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేసిన ఖుష్బూ
Khushbu
Follow us on

Khushbu Sundar: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇక్కడి థౌసండ్ లైట్స్ అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున సినీ నటి ఖుష్బూ పోటీ చేస్తున్నారు. ఆమె ఈ ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ డబ్బులు వెదజల్లి గెలవాలనుకుంటోందని ఈ సందర్భంగా ఖుష్బూ ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు.

”ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని డీఎంకే ప్రయత్నిస్తోంది. అందుకోసం అడ్డదారులు తొక్కుతోంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తోంది. డబ్బులు ఇవ్వడం లేదంటే బెదిరించడం ద్వారా ఓటర్లను తనకు అనుకూలంగా మార్చుకోవాలని డీఎంకే పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై మేము ఎన్నికల కమిషనర్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశాం” అని ఖుష్బూ చెప్పారు.

”నా నియోజకవర్గంలో 220 మంది ఓటర్లను లిస్టు నుంచి తొలగించారు. ఈ విషయంపై కూడా ఈసీకి ఫిర్యాదు చేసాం., ఇప్పటికే పోలీసులు అవకతవకలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు.” అని ఆమె తెలిపారు.

మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం అవసరమని చెప్పిన ఖుష్బూ, అందుకోసం ఆడపిల్ల పుట్టిన వెంటనే లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానని చెప్పారు. ఆ సొమ్ము ఆ ఆడపిల్ల ఎదుగుదలకు సహకరిస్తుందని పేర్కొన్నారు.

తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఓకే దశలో రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పార్టీ 2011లో అధికారాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే తో నువ్వా నేనా అన్నట్టు తలపడుతోంది.

Also Read: Tamil Nadu Assembly Election 2021 voting Live: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

West Bengal Assembly Election 2021 Live: రసవత్తరంగా బెంగాల్, అస్సాం ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్..