चुनाव क्षेत्र चुनें

బోడినాయకనూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021

తమిళనాడులోని తేని జిల్లా బోడినాయకనూర్ అసెంబ్లీ సీటులో ఇద్దరు అగ్రనేతల మధ్య హోరాహోరా పోరు నెలకొంది. ఒక వైపు ఏఐడీఎంకే సమన్వయకర్త, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పోటీలో ఉండగా.. మరోవైపు డీఎంకే టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన తంగా తమిళసెల్వాన్‌ను పోటీలో దించింది. రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఏ ఎన్నికలలోనూ కూడా ఓటమి ఎరుగని పన్నీర్‌సెల్వం, తంగా.. ఇద్దరూ కూడా 2001లో ఒకేసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఇద్దరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితులుగా పోరు పొందారు. కానీ ఇద్దరి మధ్య ఎప్పుడూ కొద్దిగా వైరం ఉండేది. అలాంటి వారు ఇప్పుడు ప్రత్యేక్ష బరిలో దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాత రికార్డులను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థులు 1957 నుంచి 1967 వరకు, 1984లో మొత్తం నాలుగు సార్లు విజయం సాధించారు. 1971, 1996, 2006 సంవత్సరాల్లో డీఎంకే అభ్యర్థులు గెలిచారు. 1977, 80, 89, 91, 2001, 2006, 2011 ఏఐడీఎంకే అభ్యర్థులు గెలిచారు. ఓ పన్నీర్‌సెల్వం 2011, 2016 ఎన్నికల్లో ఈ సీటు నుంచి గెలుపొందారు. 2016 ఎన్నికలలో ఆయన.. డీఎంకే అభ్యర్థి కెఎస్ లక్ష్మణను సుమారు 16 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

తమిళనాడు న్నికల ఫలితాలు

  • పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
  • అసెంబ్లీ సీటుబోడినాయకనూర్
  • మొత్తం ఓట్లు96902
  • నోటా0
  • వ్యత్యాసం0
Ads By Adgebra