Punjab Election Results Update: పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) సంచలనం సృష్టించింది. చీపురుతో సమీప పార్టీ అభ్యర్థుల దుమ్ము దులిపి.. 2/3 మెజార్టీతో పంజాబ్ సిఎం(Punjab CM) పీఠాన్ని కైవసం చేసుకుంది. కౌంటింగ్ మొదట కాంగ్రెస్, ఆప్ ల మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగినా.. ఆప్ స్పష్టమైన మెజార్టీ దిశగా అడుగులు వేసింది. పంజాబ్ లో మొత్తం 117 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. అధికారికంగా ఇంకా రిజల్ట్ ఇంకా వెలువడాల్సిన ఉండగా.. ఆప్ ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటి సీట్ల ను సొంతం చేసుకోవడంతో పంజాబ్ పీఠం ఆప్ కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ 83 స్థానాల్లో దూసుకుపోతూ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత కాంగ్రెస్ 23 స్థానాలతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది. శిరోమణి అకాళీదళ్ కూటమి 8 స్థానాలు, బీజేపీ కేవలం మూడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
పంజాబ్ లో ఆప్ సీఎం అభ్యర్థి ముందంజ..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో జలాల్‌బాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవత్ సింగ్ మాన్ ముందంజలో కొనసాగుతున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ రెండుస్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నారు. అదేవిధంగా పంజాబ్‌లోని పాటియాలా అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తోన్న పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అజిత్ పాల్ కోహ్లీ కంటే 3, 300 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఇక తూర్పు అమృత్‌సర్ నుంచి పోటీచేస్తోన్న పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మూడో స్థానానికి పడిపోయారు.
Also Read: