పుదుచ్చేరిలో మారిపోతున్న రాజకీయ పరిణామాలు, ఒంటరిగానే కాంగ్రెస్ పోటీ ?

పుదుచ్చేరిలో వేగంగా మారిపోతున్న రాజకీయ సమీకరణాలు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలకు కలవరం కలిగిస్తున్నాయి. పుదుచ్ఛేరి ఎన్నికల్లో డీఎంకేని కాదని, ఒంటరిగానే పోటీ చేయాలనీ  తమిళనాడు కాంగ్రెస్ యోచిస్తోంది,

  • Umakanth Rao
  • Publish Date - 2:23 pm, Sat, 6 March 21
పుదుచ్చేరిలో మారిపోతున్న రాజకీయ పరిణామాలు, ఒంటరిగానే కాంగ్రెస్ పోటీ ?

పుదుచ్చేరిలో వేగంగా మారిపోతున్న రాజకీయ సమీకరణాలు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలకు కలవరం కలిగిస్తున్నాయి. పుదుచ్ఛేరి ఎన్నికల్లో డీఎంకేని కాదని, ఒంటరిగానే పోటీ చేయాలనీ  తమిళనాడు కాంగ్రెస్ యోచిస్తోంది, తమిళనాట డీఎంకేతో సంబంధాలను తెగతెంచుకున్న తరువాత ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో డీఎంకేతో పొత్తు కొనసాగకపోవచ్ఛునని భావిస్తున్నారు. బీజేపీ, ఎన్ ఆర్ కాంగ్రెస్ లోకి సీనియర్ నేతలు చేరిపోవడంతో కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తుతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీని, దాని మిత్ర పక్షాలను ఎదుర్కోవాలంటే డీఎంకే మద్దతు అవసరమని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక అన్నాడీఎంకే, ఎన్ ఆర్ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో పుదుచ్చేరిలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ-ఎన్ ఆర్ కాంగ్రెస్ మద్దతును కోల్పోవచ్చు.డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు లేని పక్షంలో.. డీఎంకేతో చేతులు కలపాలని ఎన్ ఆర్ కాంగ్రెస్ యోచిస్తోంది.  అదే సమయంలో ఎన్డీయే నుంచి దూరమై ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఈ పార్టీ హెచ్చరిస్తోంది. ఒకవేళ ఈ పార్టీ ఇదే నిర్ణయం తీసుకున్న పక్షంలో.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు ఇటీవల డీఎంకే కూడా ఆసక్తిని చూపింది.

ఎన్ ఆర్ కాంగ్రెస్ నేతలు ముగ్గురు ఈ మధ్య డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ ని చెన్నైలో కలుసుకుని తమతో పొత్తు కుదుర్చుకోవలసిందిగా పుదుచ్చేరి డీఎంకే నేతలకు నచ్చ్చజెప్పాలని కోరారు. లేదా ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. అటు- ఎన్ ఆర్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.రంగసామి బీజేపీతో  సీట్ల సర్దుబాటుపై అసంతృప్తితో ఉన్నారు. తమిళనాడు పరిణామాలను ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నారు. మొత్తం మీద ఈ కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ.. తనకు అనువైన మార్గాల కోసం అన్వేషిస్తోంది ఇక్కడ కాంగ్రెస్ ప్రాబల్యాన్ని కట్టడి చేయాలని యోచిస్తోంది. .ఇదిలా ఉండగా ఎన్ ఆర్ కాంగ్రెస్ ఎన్డీయేలో భాగమని, మరో రెండు రోజుల్లో ఎన్డీయే నేతలు సమావేశమై, పుదుచ్చేరి ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిపైన, నియోజకవర్గ ఒప్పందాలపైన  చర్చిస్తారని బీజేపీ నేత ఒకరు చెప్పారు.

మరిన్ని చదవండి ఇక్కడ :

స్పర్మ్ డొనేట్ చేస్తే లక్షల్లో డబ్బులు..డబ్బులు లేక చేసిన పని లక్షల్లో ఆదాయం చూపింది : Sperm Donor Video.

విజయనగరం యువతి ఫేక్‌స్టోరీ! కాళ్లుచేతులు కట్టేసుకుని..తానే నాటకం ఆడినట్టు అంగీకారం : girl kidnap video