Covid Vaccination: ఎన్నికల సంఘం చర్యలు.. ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోదీ ఫొటో తొలగింపు..

|

Mar 11, 2021 | 3:19 PM

Covid Vaccination Certificates: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. దీంతోపాటు..

Covid Vaccination: ఎన్నికల సంఘం చర్యలు.. ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై మోదీ ఫొటో తొలగింపు..
Follow us on

Covid Vaccination Certificates: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. దీంతోపాటు నాయకులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలను వేడిక్కిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై నరేంద్ర మోదీ ఫోటోలు ప్రచురిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించింది.

దీంతో పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో మోదీ ఫొటోను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజాగా గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్.. ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ఆరోగ్యశాఖ కార్యదర్శులకు రాసిన లేఖలో మోదీ ఫోటోను వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై గత కొన్నిరోజులుగా బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధ నెలకొంది. డాక్టర్లు ఆరోగ్య కార్యకర్తలకు ద‌క్కాల్సిన క్రెడిట్‌ను మోదీ తీసుకుంటున్నార‌ంటూ టీఎంసీ నాయకులు మొదటనుంచి విమర్శిస్తున్నారు.

Also Read:

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో కేసుల పెరుగుదలపై ఏమన్నారంటే..?

BDL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్‌