Sonu Sood: సోనూసూద్ పై కేసు.. నిబంధనలు ఉల్లంఘించినట్లు అభియోగం.. అసలేం జరిగిందంటే..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ నటుడు సోనూసూద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున తన సోదరి కోసం..

Sonu Sood: సోనూసూద్ పై కేసు.. నిబంధనలు ఉల్లంఘించినట్లు అభియోగం.. అసలేం జరిగిందంటే..
Sonusood
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 22, 2022 | 12:07 PM

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ నటుడు సోనూసూద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున తన సోదరి కోసం మోగాలోని లాండెకే గ్రామంలో ప్రచారం చేస్తూ నిబంధనలను ఉల్లంఘించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అంతే కాకుండా పోలింగ్ బూత్ వద్ద ఉన్న సోనూసూద్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం మోగాలోని పోలింగ్ స్టేషన్లను సందర్శించకుండా సోనూ సూద్ ను నిషేధించింది. దీనిపై స్పందించిన సోనూ.. తన వంతుగా, తాను పోలింగ్ బూత్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా మాత్రమే ప్రయత్నిస్తున్నానని అన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో డబ్బులు పంపిణీ చేయడాన్ని మేం అడ్డుకుంటున్నాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడటం తమ కర్తవ్యమని వెల్లడించారు.

మరోవైపు ఆపద సమయంలో ఆదుకుంటున్న సోనూసూద్ ఎందరో హృదయాలను గెలుచుకున్నారు. నేటికీ ఆయన ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉన్న పరిస్థితుల్లో సహాయం కోసం వేడుకున్న వారందరినీ సోనూ ఆదుకున్నారు.

Also Read

ఆదివారం చేపలు తింటున్నారా.. మటన్ తింటున్నారా.. ఈ విషయాలు తెలిస్తే మీ ఎంపిక మారుతుంది..?

అక్క పెళ్ళిలో చెల్లెలు సందడి !! బిజిలీ బిజిలీ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో

Assembly Meet: ఈనెల 25 లేదా 28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ముందు రోజే భేటీ కానున్న కేబినెట్!