UP Assembly Elections: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై కేసు నమోదు.. కారణం అదేనా..?

భారత ఎన్నికల సంఘం పేర్కొన్న ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై కేసు నమోదైంది.

UP Assembly Elections: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై కేసు నమోదు.. కారణం అదేనా..?
Akhilesh Yadav
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 22, 2022 | 9:59 AM

Uttar Pradesh Assembly Election 2022: భారత ఎన్నికల సంఘం(Election Commission of India)పేర్కొన్న ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత అఖిలేష్ యాదవ్‌(Akhilesh Yadav)పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో మూడో విడత పోలింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ వద్ద మీడియాతో మాట్లాడినందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కేసు నమోదైంది.మూడో విడత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం అభినవ్ స్కూల్ సైఫాయి పోలింగ్ కేంద్రంలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని జిల్లా మేజిస్ట్రేట్ శృతి సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని గ్రహించి డిప్యూటీ కలెక్టర్‌, సర్కిల్‌ అధికారి విచారణకు ఆదేశించామని శృతి సింగ్‌ తెలిపారు. విచారణ అనంతరం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద కేసును పరిగణిస్తూ సైఫాయి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఆదివారం నాడు, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, SP అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, అతని భార్య, మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ ఇటావా జిల్లాలోని వారి స్వగ్రామం సైఫాయ్‌లో ఓటు వేశారు. మూలాయం వీల్ చైర్‌లో పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై మండిపడ్డారు. పోలింగ్ కేంద్రం వద్ద రాజకీయాలు మాట్లాడంతో మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా, COVID-19 ప్రోటోకాల్‌లను కూడా ఉల్లంఘించారని ఆయనపై ఫిర్యాదు అందాయి.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశలో భాగంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరగింది. ఈ సందర్భంగా సగటున 60 శాతానికి పైగా ఓటింగ్ జరగడం గమనార్హం. ఎన్నికల సంఘం ఓటింగ్‌ శాతంలో ఇచ్చిన వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు సగటున 60.63% ఓటింగ్‌ నమోదైంది. మూడో దశలో 97 మంది మహిళలతో సహా మొత్తం 627 మంది అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (ఈవీఎంలు)లో నిర్లిప్తమైంది.

Read Also…

India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే..?