Telangana: ఒక్క గేటు ఓపెన్ చేశాం.. కాంగ్రెస్ లోకి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం

పార్లమెంట్ ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలోకి ఊహించనివిధంగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరగా, తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు.  CM రేవంత్‌, దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో వీరిద్దరు పార్టీలో చేరారు.

Telangana: ఒక్క గేటు ఓపెన్ చేశాం.. కాంగ్రెస్ లోకి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం
Tcongress

Updated on: Mar 17, 2024 | 2:11 PM

పార్లమెంట్ ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలోకి ఊహించనివిధంగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరగా, తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు.  CM రేవంత్‌, దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో వీరిద్దరు పార్టీలో చేరారు. తాను చేవేళ్ల నియోజకవర్గ అభివ్రుద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నానని రంజిత్ రెడ్డి చెబుతుండగా, తాను బీఆర్ఎస్ లో ఉంటానని పార్టీ మార్పుపై ప్రకటన చేస్తూనే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ రోజు ఒక గేటు ఓపెన్ చేశానని సీఎం రేవంత్ చెప్పారు. ఇంకా ఎంతమంది చేరతారో చెప్పలేం అని రేవంత్ అన్నారు.  విపక్ష పార్టీ ఖాళీ అయ్యేదాకా ఆపరేషన్ ఉంటుందని ఆయన అన్నారు. ఇవాళ పొద్దున్నే గేట్లు ఓపెన్‌ చేశామని  మీట్‌ ది మీడియాలో సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ వర్గంలో కలకలకం రేపింది. అవతలి వర్గం ఖాళీ అయినపుడు, గేట్లు మూసినా తెరిచినా ఒకటే అని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి రేవంత్‌ అన్నారు. 100వ రోజు ఒక గేటు మాత్రమే తెరిచానని సీఎం రేవంత్ తనదైన స్టైలు లో చెప్పారు. అయితే వీరిద్దరు కాంగ్రెస్ లోకి చేరడంతో అటు ఖైరతాబాద్, ఇటు చేవెళ్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ముందు కీలక నేతలు చేజారుతుండటంతో బీఆర్ఎస్ వర్గంలో ఆందోళన మొదలైంది.