Mayawati sensational Comments on Congress: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (Uttar Pradesh Assembly Elections 2022) సమీపిస్తున్న తరుణంలో రాజకీయం క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. ఎవ్వరూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి.. కాంగ్రెస్(Congress)పై చేసిన కామెంట్స్ ఇప్పుడు యూపీలో సంచలనం రేపుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం శరవేగంగా మారుతోంది. పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ చేస్తారో, ఎవరు ఎవరికి మిత్రులో, ఎవరికి శత్రువో… అన్నీ క్షణాల్లో మారిపోతున్నాయి. కలుస్తారనున్నవాళ్లు కత్తులు దూసుకుంటుంటే, శత్రువులేమో మిత్రులుగా మారిపోతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఊహించనివిధంగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కారణంగా బీఎస్పీ ఓటు బ్యాంకుకు దెబ్బ పడుతుందనుకుందో ఏమో.. సడన్‌గా కాంగ్రెస్ అండ్ ప్రియాంకాగాంధీపై మాయావతి విరుచుకుపడింది.
కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అంటూ కొత్త స్లోగన్ అందుకుంది. బీజేపీయేతర ఓట్లు చీల్చేందుకు మాత్రమే కాంగ్రెస్ పోటీ చేస్తోందంటూ మాయా మేడం హాట్ కామెంట్స్ చేసింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిపై గంటల్లోనే ప్రియాంక మాట మార్చిందంటే… యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోమంటూ సెటైర్లు వేశారు మాయావతి. కాంగ్రెస్‌కు ఓటు వేసి మీ విలువైన ఓటును వృథా చేసుకోవద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు బీఎస్పీ అధినేత్రి. బీజేపీయేతర ఓట్లను చీల్చేందుకు మాత్రమే పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు ఎవ్వరూ ఓటు వేయొద్దని వరుస ట్వీట్లు చేశారు మాయావతి. అధికార బీజేపీని వదిలేసి, ఇలా సడన్‌గా కాంగ్రెస్‌పై మాయావతి విరుచుకుపడటం యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. మాయా కామెంట్స్ వెనక మతలబు ఏమిటోనంటూ చర్చించుకుంటున్నారు ఉత్తరప్రదేశ్ ప్రజలు.
1. यूपी विधानसभा आमचुनाव में कांग्रेस पार्टी की हालत इतनी ज़्यादा ख़स्ताहाल बनी हुई है कि इनकी सीएम की उम्मीदवार ने कुछ घण्टों के भीतर ही अपना स्टैण्ड बदल डाला है। ऐसे में बेहतर होगा कि लोग कांग्रेस को वोट देकर अपना वोट ख़राब न करें, बल्कि एकतरफा तौर पर बीएसपी को ही वोट दें।
— Mayawati (@Mayawati) January 23, 2022
2. यूपी में बीएसपी की रही सरकार में लगभग ढाई लाख गरीब परिवारों को बुनियादी सुविधाएं-युक्त आवास उपलब्ध कराया व करीब 15-20 लाख मकानों की तैयारी चल रही थी, किन्तु सरकार बदलने के कारण यह कार्य अधूरा रह गया, जिसे ही भाजपा भुनाने का प्रयास कर रही है। इन्होंने अपना क्या किया?
— Mayawati (@Mayawati) January 24, 2022
Read Also…. Bihar Fire: క్రికెట్ ఆడుతున్న పిల్లలపై కాల్పులకు తెగబడ్డ మంత్రి కొడుకు.. గ్రామస్థులు ఏం చేశారంటే?