కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మూహూర్తం సమీపిస్తోంది. పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు సుడిగాలి ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షిస్తూ తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం (మే 6)న సుమారు 36 కిలో మీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానికి బ్రహ్మరథం పట్టారు బెంగళూరు వాసులు. రహదారుల పొడవునా మోడీకి పూలమాలలతో అపూర్వ స్వాగతం పలికారు. ఇక మోడీ రోడ్ షో వెళ్లిన రహదారులన్నీ బీజేపీ జెండాలు, కాషాయ జెండాలు, జై హనుమాన్, జై భజరంగిబలి జెండాలతో రెపరెపలాడాయి. ఈక్రమంలో మోడీ రోడ్ షోలకు ఊహించని దానికంటే ప్రజల నుంచి ఎక్కవ మద్దతు రావడంతో బెంగళూరు బీజేపీ నాయకులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇక ప్రచారంలో భాగంగా మోడీ హవేరీ జిల్లాలో పర్యటించగా.. అక్కడి స్థానికులు ప్రత్యేకించి ఏలకులతో చేసిన మాల, కిరీటం మోడీకి బహూకరించారు.
కాగా బెంగళూరు వాసులు తనపై చూపిన ఆదరాభిమానాలకు ప్రధాని మోడీ ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. బెంగళూరులో తన రోడ్‌షోకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ .. ‘బెంగళూరులో ఈరోజు నాకెంతో ప్రత్యేకంగా గడిచింది’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చారు. కాగా ప్రధాని మోడీ రోడ్ షో కోసం సుమారు 40 టన్నుల పూలను వినియోగించారు. ప్రధాని మోడీని చూసేందుకు చిన్నారులతో సహా నగర ప్రజలు తరలివచ్చారు. కొందరు చిన్నారులు రాముడు, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ మహరాజ్, ప్రభు శ్రీరాముడి వేషధారణలతో ఈ రోడ్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
Here is why today was so special in Bengaluru… pic.twitter.com/PMb5LPBOJl
— Narendra Modi (@narendramodi) May 6, 2023
Addressing a rally in Badami. The enthusiasm of people is reflective of Karnataka’s desire to elect the BJP. https://t.co/YxpmefnP3A
— Narendra Modi (@narendramodi) May 6, 2023