Harish Rao: పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు పోయినవాళ్లు మళ్ళీ వచ్చి కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత మంది బీఆర్ఎస్ నాయకులను కొనొచ్చుగాని, ఉద్యమ కారులను,బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రజలను కొనలేరు అన్నారు ఆయన.

Harish Rao: పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao

Edited By: Balu Jajala

Updated on: Mar 29, 2024 | 4:30 PM

బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు పోయినవాళ్లు మళ్ళీ వచ్చి కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత మంది బీఆర్ఎస్ నాయకులను కొనొచ్చుగాని, ఉద్యమ కారులను,బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రజలను కొనలేరు అన్నారు ఆయన. కష్టకాలంలో బీఆర్ఎస్‌ పార్టీకి ద్రోహం చేసినోళ్లు కన్నతల్లికి ద్రోహం చేసినట్టే అని ఆయన మండిపడ్డారు. కార్యకర్తలు వెళ్లడంలేదు. ఇది శిశిరకాలం, పనికిరాని ఆకులుపోతాయి, కొత్త చిగురు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలుచేసే వరకు అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తం అన్నారు. కాంగ్రెస్ అబద్ధాలను, మోసాలనే ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో కనువిప్పు కలిగించాలని హరీశ్ రావు కార్యకర్తలకు సూచించారు.

ఆరు గ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఏదో జరిగిందని అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేయిస్తమని, రేవంత్ ఇంకా ప్రతిపక్ష నాయకుడిలాగే మాట్లాడుతున్నాడని, రేవంత్ మావవబాంబులా కాదు, మానవీయంగా ప్రవర్తించలని హరీశ్ రావు సూచించారు. వందరోజుల పాలన చూసి ఓటేయమని రేవంత్ అడుగుతున్నాడని, మరి వందరోజుల్లో ఎన్నికల హామీలను అమలు చేసిండా? హరీశ్ రావు ప్రశ్నించారు.

4 వేల పింఛన్, రైతుబంధు, తలం బంగారం, వడ్లకు బోనస్ వచ్చిందా? రాలేదు. ఎన్నో గడువులు దాటిపోయినా ఏవీ అమలు కాలేదు. అందుకే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చురుకు పెట్టాలన్నారు. దుబ్బాక బైఎలక్షన్లలో బూటకపు హామీలిచ్చి గెలిచిన రఘునందన్ రావు కూడా మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడని, నిరుద్యోగ భృతి, రెండు ఎడ్లు, నాగలి ఏవేవో ఇస్తామని మాట తప్పిండన్నారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సిద్దిపేట జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. పేదలకు సాయం చేసే పెద్ద మనసు ఉందన్నారు. విద్యావంతుడైన, కలెక్టర్‌గా పనిచేసిన ఆయనను గెలిపిస్తే ఢిల్లీలో మన గళం బలంగా వినిపిస్తాడు. దుబ్బాకకు, మెదక్‌కు నిధులు తెప్పిస్తాడని హరీశ్ రావు అన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు ఆయన విజయానికి కష్టపడి పనిచేయాలన్నారు మాజీ మంత్రి సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..