EC announces By Election schedule : రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ 17 పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ ఉప ఎన్నికలకు వెళ్లనుండగా, వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణలోని నాగార్జునసాగర్, గుజరాత్‌లోని మోర్వా హదాఫ్(ఎస్టీ), జార్ఖండ్‌లో మధుపూర్, కర్ణాటకలో బసవకల్యాణ్, మస్కీ(ఎస్టీ), మధ్యప్రదేశ్‌లో దామోహ్, మహారాష్ట్రలో పండర్‌పూర్, మిజోరాంలో సెర్చిప్(ఎస్టీ), నాగాలాండ్‌లో నోక్‌సేన్(ఎస్టీ), ఒడిశాలో పిపిలి, రాజస్థాన్‌లో సాహరా, సుజన్‌ఘర్(ఎస్సీ), రాజ్‌సమండ్, ఉత్తరాఖండ్‌లో సాల్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది.
ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. అన్నీ స్థానాలకు ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహణ. మే 2న ఫలితాల వెల్లడి. ఆయా స్థానాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ మొదలుకానుంది. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం షెడ్యూల్ చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండిః16.03.2021 Schedule for bye-elections in PCs and ACs of various States
తిరుపతి లోక్‌సభ, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్.. ఏఫ్రిల్ 17న పోలింగ్