YS Vivekananda Reddy Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రముఖంగా వినిపించిన పేరు ఎర్ర గంగిరెడ్డి. ఆయన బెయిల్ రద్దు పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎర్రగంగిరెడ్డి బయట ఉంటే.. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. అయితే దీనికి సంబంధించి.. సరైన సాక్ష్యాలు లేనందున బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.
వైఎస్ వివేకా హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డికి.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలతో దిగువ కోర్టు బెయిలిచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని రద్దు చేయాలని.. సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. బెదిరింపులకు పాల్పడినట్టు వాంగ్మూలాలను.. సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. గంగిరెడ్డి బయటఉంటే.. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. దర్యాప్తు సరిగా చేయలేమని సీబీఐ తరుఫున వాదనలు వినిపించారు. సాక్షులను సైతం బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే .. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. దీనికి సంబంధించి… సరైన సాక్ష్యాలు లేవని.. సీబీఐ వేయిన బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేసింది.
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే.. అతడికి సంబంధించిన విషయాలను సీబీఐ బయటపెట్టింది. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో వివేకా హత్యకు కుట్ర జరిగిందని సీబీఐ పేర్కొంది. అయితే హత్య చేయడానికి నెల రోజుల ముందుగానే.. నిందితులు షేక్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ను ఇంటికి పిలిపించి.. మరీ.. హత్యకు పథక రచన చేశారని సీబీఐ నివేదించింది. వివేకా హత్యలో కీలకపాత్ర అతడిదేనని తెలిపింది. అయితే.. వివేకా హత్య కేసులో.. గతంలో ఎర్ర గంగిరెడ్డి అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. గంగిరెడ్డి బెయిల్ రద్దు కొరుతూ.. సీబీఐ అదనపు ఎస్పీ రామ్ సింగ్.. ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. వైఎస్ వివేకా.. హత్య కేసులో ఇటీవలే సంచలన నిజాలు బయటకు వచ్చాయి. వివేకా కుమార్తె వాంగ్మూలం, ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలు బయటకు రావడంతో.. ఒక్కో విషయం బయటకు వస్తుంది. ఈ కేసుపై సీబీఐ కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తోంది.