Hathras: హత్రాస్‌లో మరో దారుణం.. బాలికను తల్లి ఎదుటే కాల్చి చంపిన ఉన్మాది.. అసలేం జరిగిందంటే?

|

May 22, 2021 | 5:29 AM

UP Hathras: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమె తల్లి ముందే

Hathras: హత్రాస్‌లో మరో దారుణం.. బాలికను తల్లి ఎదుటే కాల్చి చంపిన ఉన్మాది.. అసలేం జరిగిందంటే?
UP Hathras
Follow us on

UP Hathras Shooting: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమె తల్లి ముందే కాల్చి చంపాడు. అనంతరం బాలిక తల్లిపై కూడా కాల్పులు జరపగా.. ఆమె తృటిలో తప్పించుకుంది. నిందితుడిది మధురలోని హసన్ గ్రామంలో నివసిస్తున్న నరేంద్ర అలియాస్ రింకుగా పోలీసులు గుర్తించారు. ఈ విషాదకర సంఘటన హత్రాస్ జిల్లాలోని కైలోరా గ్రామంలో జరిగింది. ఈ సంఘటన గురువారం జరిగింది. నరేంద్ర అతని స్నేహితుడితో కలిసి బాలిక ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం బాలిక ఆమె తల్లితో గొడవపడ్డాడు.

ఈ క్రమంలో అతని వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో బాలిక కడుపులో కాల్చాడు. తల్లిపై కూడా కాల్పులు జరపగా ఆమె తప్పించుకుంది. అనంతరం తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా.. మార్గమధ్యంలోనే మరణించింది. అకస్మాత్తుగా కాల్పుల శ‌బ్ధం రావడంతో అక్క‌డికి చేరుకున్న స్ధానికులు రింకూను ప‌ట్టుకోని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని వెంట వచ్చిన మరో స్నేహితుడు తప్పించుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన హత్రాస్ పోలీసులు అత‌డి నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు బాలికకు ఫేస్‌బుక్‌లో పరిచయమై గత ఏడాది కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఇద్ద‌రి మ‌ధ్య ఏదో విష‌య‌మై బేధాభిప్రాయాలు త‌లెత్త‌డంతో ఈ దారుణానికి ఒడిగ‌ట్టినట్లు పోలీసుల ద‌ర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Air India: ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్.. ప్రపంచ వ్యాప్తంగా 45 లక్షల మంది డేటా చోరీ..

Uganda Prostitution Racket: కోరుకున్న చోటుకు యువతులు.. ఆన్‌లైన్ వ్యభిచార ఉగాండా ముఠా గుట్టు రట్టు!