అరకులోయలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలు..! చూసి షాకైన పర్యాటకులు..

ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయ. వీకెండ్ కావడంతో టూరిస్టుల రద్దీ బాగా పెరిగింది. అరకుతో పాటు పరిసర ప్రాంతాల్లోని సందర్శకుల హడావిడి కనిపించింది. ఇంతలో అందరికీ షాక్.. ఎందుకంటే ఆ వార్త అలాంటిది.. దృశ్యాలు కూడా..! అరకులోయలో యువతి, యువకుడు ఆత్మహత్య కలకలం రేపుతోంది. కరక వలస వద్ద చెట్టుకు ఇద్దరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.

అరకులోయలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలు..! చూసి షాకైన పర్యాటకులు..
Araku Vally

Edited By:

Updated on: Mar 03, 2024 | 9:50 PM

ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయ. వీకెండ్ కావడంతో టూరిస్టుల రద్దీ బాగా పెరిగింది. అరకుతో పాటు పరిసర ప్రాంతాల్లోని సందర్శకుల హడావిడి కనిపించింది. ఇంతలో అందరికీ షాక్.. ఎందుకంటే ఆ వార్త అలాంటిది.. దృశ్యాలు కూడా..! అరకులోయలో యువతి, యువకుడు ఆత్మహత్య కలకలం రేపుతోంది. కరక వలస వద్ద చెట్టుకు ఇద్దరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. సుంకరమెట్ట – కటికి జలపాతం మధ్య ఉన్న అడవిలో ఇద్దరు యువకులు ఉరివేసుకున్నారు. వీరిని పశువుల కాపరి గుర్తించి పోలీసులకు సమాచారం అందించ్చారు. విషయం ఆ నోట ఈనోట పాకింది. వెళ్లి చూసేసరికి ఇద్దరు.. వేలాడుతూ కనిపించారు. ఒకే చున్నితో ఇద్దరూ మెడలో బిగించుకున్నారు.

ఒక కొమ్మకు రెండు వైపులా ఇద్దరు వేలాడుతూ కనిపించారు. అబ్బాయి బ్లాక్ జీన్స్, బ్రౌన్ బ్లాక్ షర్ట్ ధరించగా.. అమ్మాయి బ్లూ వైట్ టాప్, బ్లాక్ లెగ్గిన్ ధరించి ఉన్నారు. ఈ దృశ్యాలు చూసిన వారందరి హృదయాలు కలచివేతకు గురైంది. ఇద్దరూ ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో కూడా తెలియదు. ప్రేమికులు పర్యాటకులుగా వచ్చి ఉరి వేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అరకులోయ పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. చనిపోయిన వారిద్దరినీ పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడిచారు పోలీసు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us