Man sets fire to Woman’s house: ఓ యువకుడు.. ఒకరితో పెళ్లి నిశ్చయం చేసుకొని.. మరొకరితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న యువతినే పెళ్లి చేసుకుంటాని.. చెప్పి ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. తీరా పెళ్లి నిశ్చయం అయిన యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆమె కుటుంబసభ్యులు ఆ యువకుడిపై కేసు పేట్టారు. తీరా
తనపై పోలీసు స్టేషన్‌లో పెట్టిన కేసు వెనక్కి తీసుకోలేదని యువతి ఇంటికి వెళ్లి నిప్పు పెట్టాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం చినబేతపూడి గ్రామంలో చోటుచేసుకొంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చౌటా ఫ్రాన్సిస్ అనే యువకుడిని వరసకు మరదలయ్యే మైథిలిని వివాహం చేసుకోవటానికి ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో అంగీకారం అయింది. పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఫ్రాన్సిస్ మరో యువతితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడని తెలిసి మైథిలి నిలదీసింది. తనను వివాహం చేసుకోవటానికి ఫ్రాన్సిస్ నిరాకరించటంతో రెండు వారాల క్రితం ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఆ యువకుడు పెద్దల సమక్షంలో మైథిలిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మైథిలి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. దీనిని అదునుగా భావించిన ఫ్రాన్సిస్ ప్రేమించిన మరో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.
దీంతో ఫ్రాన్సిస్‌పై మైథిలి కుటుంబ సభ్యులు నాలుగురోజుల క్రితం వెదుళ్లపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై కేసును ఉపసంహరించుకోవాలని ఫ్రాన్సిస్ మైథిలి కుటుంబ సభ్యులపై ఫ్రాన్సిస్ ఒత్తిడి చేశాడు. కానీ మైథిలి కుటుంబసభ్యులు నిరాకరించడంతో.. కక్ష పెంచుకొన్న ఫ్రాన్సిస్ చినబేతపూడిలోని మైథిలి కుటుంబానికి చెందిన పూరి పాకకు శుక్రవారం తెల్లవారుజామున నిప్పు పెట్టి పరారయ్యాడు. యువతి తల్లి విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: