హైదరాబాద్ మళ్లీ ఉలిక్కిపడింది. మొన్న సరూర్‌నగర్. ఇప్పుడు బేగంబజార్. లొకేషన్ మారిందంతే. సీన్ మాత్రం సేమ్. అక్కడ గునపంతో పొడిచిపొడిచి చంపారు. ఇక్కడ తల్వార్లతో నరికి నరికి చంపారు. నెత్తురు కారుతున్న ఆ ఆ కత్తులకు, బైక్‌లపై కూనీకోర్లు చేసిన హల్‌చల్‌కు బేగంబజార్ గజగజలాడింది. అందరూ చూస్తుండగానే హత్య. హత్య చేసిన వాళ్లు ఒక్కో అడుగు ముందుకేసి వెళ్తుంటే.. చుట్టూ ఉన్న జనం భయంతో పరుగులు పెట్టారు. మొన్న సూర్‌నగర్‌లో చనిపోయిన వ్యక్తి నాగరాజు అయితే.. ఇప్పుడు విచక్షణా రహితంగా తల్వార్ దాడికి ప్రాణం వదిలింది నీరజ్ పన్వార్. అతను బైక్‌పై వెళ్తుంటే అడ్డగించి ఎటాక్ చేశారు.హత్యకు కారణాలు ఇంకా తెలీదుగానీ.. ప్రేమ పెళ్లి వ్యవహారం, పరువు హత్యగానే చెప్పుకుంటున్నారు స్థానికులు. వాళ్లు చెబుతున్నదాన్ని బట్టి పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కానీ.. చంపిన తీరు చూస్తే.. కూడా వాళ్లలో ఒక కసి ఉందంటున్నారు లోకల్స్. నీరజ్‌ను ఒకటీ రెండుసార్లు మొత్తం 20 సార్లు కత్తితో నరికి చంపారు. కొన ఊపిరితో ఉన్న నీరజ్ పన్వార్‌ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటన హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేపింది. ఇటీవల సరూర్‌నగర్ లో జరిగిన మర్డర్‌ని మరిచిపోకముందే మరోసారి నడిరోడ్డుపై హత్య జరగడంతో జనం భయంతో వణికిపోతున్నారు. నీరజ్ పన్వార్ హత్య జరిగిన సమయంలో జనం భయంతో పారిపోయారు.