Elephants Attack Chhattisgarh: ఛత్తీస్‌గఢ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపులు సంచరిస్తున్నాయి. పంటలు నాశనం చేయడంతో పాటు స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో రైతులు నిద్రాహారాలు మాని పంటలను కాపాడుకోవడానికి శ్రమిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దంతరి జిల్లాలో ఓ ఏనుగల గుంపు ఓ యువకుడిని తొక్కి చంపాయి. వివరాలు ఇలా ఉన్నాయి..
విశ్రామ్‌పూర్ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు దాడిలో యువకుడు మృతిచెందాడు. విండోటోలా అటవీ ప్రాంతంలో కూలి పనులు చేసేందుకు వెళ్లిన యువకుడిపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల కాళ్ల మధ్యలో నలిగిపోయిన యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.