Guntur District: యువతి అనుమానాస్పద మృతి.. ఇంట్లో నల్లటి మరకలు… రంగంలోకి డీఎస్పీ ప్రశాంతి

|

Aug 11, 2021 | 1:48 PM

గుంటూరు జిల్లాలో  18 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. హత్యకు కారణాలేంటి ? అన్న విషయాలపై...

Guntur District: యువతి అనుమానాస్పద మృతి.. ఇంట్లో నల్లటి మరకలు... రంగంలోకి డీఎస్పీ ప్రశాంతి
Mysterious Death
Follow us on

గుంటూరు జిల్లాలో  18 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. హత్యకు కారణాలేంటి ? అన్న విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇంట్లో కనిపిస్తున్న నల్లటి మరకలు.. రక్తపు మరకలేనా? అన్న కోణంలో విచారణ సాగుతోంది.  గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా  మారింది. వివరాల్లోకి వెళ్తే..  గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో 18 ఏళ్ల భవానీ హత్యకు గురైంది. గ్రామ శివారు ప్రాంతంలో తగులబెట్టారు. అయితే భవానీ హత్యకు కారణాలేంటి ? అని ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమా ? అని కూపీ లాగుతున్నారు. భవానీ ఇంట్లో ఉన్న నల్లటి మరకలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. అవి రక్తపు మరకలు అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నకు తల్లిదండ్రులు నుంచి సరైన సమాధానం రాలేదు. కడుపునొప్పి కారణంగా తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.  క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. దీనిపై గ్రామస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. డీఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

గ్రామస్తుల వెర్షన్ ఇలా…

ప్రేమ వ్యవహారంలో కూతురు – తల్లిదండ్రులు మధ్య వాగ్వాదం జరిగిందని.. ఆ క్రమంలోనే కూతురు భవానీని తల్లిదండ్రులు చంపినట్లు స్థానికులు చెబుతున్నారు.  గుట్టు చప్పుడు కాకుండా కూతురు మృతదేహాన్ని దహనం చేసినట్లు పేర్కొన్నారు.

 

తెనాలిలో వివాహిత ఆత్మహత్య

తెనాలిలోని కొత్తపేటకు చెందిన బిందుశ్రీ (40) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. అనారోగ్య సమస్యల గురించి ఎప్పుడూ బాధపడేదని ఆమె భర్త కామేశ్వరరావు తెలిపారు. కొత్తపేటకు చెందిన బిందుశ్రీ, కామేశ్వరరావులకు 21 సంవత్సరాల క్రితం పెళ్లైంది. భర్తకు ఫిట్స్, భార్యకు థైరాయిడ్ సమస్యలు ఉండడంతో డాక్టర్ల సలహా మేరకు పిల్లలు వద్దు అనుకున్నారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలని బిందుశ్రీ చాలా ప్రయత్నాలు చేసింది. కొంతకాలంగా సోషల్ మీడియాల్లో, టీవిల్లో వచ్చే కార్యక్రమాలు చూస్తూ వారు చెప్పే ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ వచ్చింది. చాల ఔషధాలను వాడి చూసింది ఫలితం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో భర్త ఇంట్లో లేని క్రమంలో సోమవారం ఆత్మహత్య చేసుకుంది.

Also Read: మెదక్ కారు దగ్ధం కేసులో ముగ్గురి అరెస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్.. పోలీసులపై ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ