ఉద్యోగం కోసం నేపాల్ నుంచి ఇండియాకు వచ్చిందా 22 ఏళ్ల అమ్మాయి.. లాక్‌డౌన్‌కు ముందు నుంచి ఆ అమ్మాయి తన స్నేహితురాలు రెంట్‌కు తీసుకున్న ఇంట్లోనే ఆమెతో కలిసే ఉంటోంది.. స్నేహితురాలే కదా అని ఆమెను నమ్మింది. తన దగ్గర ఉన్న సొమ్మును దాచిపెట్టమని ఆమెకు ఇచ్చింది.. కష్టకాలంలో దాచుకున్న సొమ్మును తిరిగి ఇమ్మనేసరికి ప్లేట్ ఫిరాయించింది.. ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి.. పాపం ఆమె ముందు నేపాలీ అమ్మాయి నిలువలేకపోయింది.. ఫలితంగా తీవ్రమైన హింసలకు గురి కావాల్సి వచ్చింది.. గొడవలు జరకముందు .. ఇద్దరి మధ్య స్నేహం బాగా ఉన్నప్పుడు దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్ రాజ్‌పాల్‌యాదవ్‌ను వీడియో కాల్ ద్వారా నేపాలి అమ్మాయికి పరిచయం చేసిందా స్నేహితురాలు.. వాడ్ని కూడా నమ్మేసింది.. తన కష్టాలన్నీ ఏకరువు పెట్టుకుంది.. వాడేమో వెంటనే అక్కడ్నుంచి వచ్చేయమంటూ సలహా ఇచ్చాడు.. దగ్గరలోనే ఓ హోటల్ గది తీసుకున్నానని, అక్కడే హాయిగా ఉండవచ్చని చెప్పాడు.. రెండు రోజుల తర్వాత ప్రవీణ్‌రాజ్‌పాల్ భారత్‌కు వచ్చి.. నేరుగా హోటల్ గదిలోకి వెళ్లాడు.. ఆమెను కలిశాడు.. ఆపై డ్రగ్స్ ఇచ్చాడు.. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆమెను అభ్యంతరకర రీతిలో ఫోటోలు, వీడియోలు తీశాడు.. అప్పట్నుంచి బెదిరింపులకు దిగాడు. తన మాట వినకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానన్నాడు.. అలా బెదిరించి మరోసారి అత్యాచారం చేశాడు.. ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు.. ఈ రెండు సంఘటనతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది.. వాడి నుంచి తప్పించుకుంది.. ఇక లాభం లేదనుకుని నాగపూర్‌లో ఉన్న మరో స్నేహితురాలి దగ్గరకు బయలుదేరింది.. అలా ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వరకు 800 కిలోమీటర్లు ప్రయాణించింది. అక్కడ ఫ్రెండ్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోరాడి పోలీస్‌స్టేషన్‌లో తనను మోసగించిన స్నేహితురాలిపైనా, తనపై అత్యాచారానికి పాల్పడి, తన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన ప్రవీణ్‌రాజ్‌పాల్‌పైనా కంప్లయింట్ చేసింది.. అది వేరే రాష్టం కావడంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌గా కేసును నమోదు చేసుకున్నారు.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. అంతేకాకుండా బాధితురాలితో పాటు పోలీసు బృందం లక్నోకు వెళ్లి అక్కడి చిన్హాట్ పోలీసు స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేసింది…