Vasireddy Padma : లైంగిక వేధింపులపై మహిళా కమిషన్‌ ఆగ్రహం, వైద్యవృత్తికి మచ్చతెచ్చేలా ఉందన్న వాసిరెడ్డి పద్మ

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లైంగిక వేధింపుల వ్యవహారం వైద్యవృత్తికి మచ్చతెచ్చేలా ఉందని మహిళా కమిషన్‌ ఆగ్రహం..

Vasireddy Padma : లైంగిక వేధింపులపై మహిళా కమిషన్‌ ఆగ్రహం, వైద్యవృత్తికి మచ్చతెచ్చేలా ఉందన్న వాసిరెడ్డి పద్మ
Vasireddy Padma

Updated on: Jun 04, 2021 | 9:58 PM

GGH incident : నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లైంగిక వేధింపుల వ్యవహారం వైద్యవృత్తికి మచ్చతెచ్చేలా ఉందని మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కమిషన్‌ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ఈ క్రమంలో ఆమె, నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ అలా వ్యవహరించడం బాధాకరమన్నారు. అతడి బాధితులు ఇంకెవరున్నా నిర్భయంగా మహిళా కమిషన్‌కు వివరాలు వెల్లడించాలని చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సూచించారు. ఫిర్యాదులు చేసిన బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ లైంగిక వేధింపుల వ్యవహారంపై దర్యాప్తు జరపాలని వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీని ఆమె కోరారు. ఇలా ఉండగా, నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ వైద్య విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో నిన్న బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Read also : TS congress : గవర్నర్‌ను కలిసి రాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఇవీ.. డిమాండ్లు