విశాఖలోని జీవీఎంసీ కార్యాలయంలో ఓ మహిళ పెట్రోల్ దాడికి యత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. విశాఖలోని జీవీఎంసీ జోన్ 6వ నెంబర్ పరిధిలోని కార్యాలయంలో పెట్రోల్ దాడి ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గోపాలపట్నం పరిధిలో శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అన్నామణి అనే మహిళ..ఏఎంహెచ్‌వో లక్ష్మీతులసి పై పెట్రోల్ దాడికి యత్నించింది. ఈ ఘటనలో ఏఎంహెచ్‌వో లక్ష్మీతులసి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను వారించటంతో ప్రమాదం తప్పింది. అయితే, అసలు విషయం పరిశీలించగా…
శానిటరీ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న అన్నామణి తనకు రావాల్సిన వేతనంలో కోత విధించారని ఆరోపిస్తోంది.. దాంతో ఆవేదనకు గురైన అన్నామణి ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే, అన్నామణి గతంలో 20 రోజుల పాటు విధులకు హాజరు కాకుండా సెలవు పెట్టిందని అందుకే, తన జీతంలో కోత విధించాల్సి వచ్చిందని ఏఎంహెచ్ అధికారి లక్ష్మీ తులసి వాదన. దీంతో తనపై కక్ష్య పెంచుకున్న అన్నామణి ఇలా పెట్రోల్‌తో ఎటాక్ చేసిందని ఆరోపించింది. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.