Nellore: 3 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. అన్యోన్యంగా కాపురం.. ఓ పాప.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్

|

Aug 11, 2021 | 1:18 PM

నెల్లూరులో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగింది. తనను ఇంటి నుంచి గేంటేశాడని భార్య శిల్ప నిరసన చేపట్టింది.

Nellore: 3 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. అన్యోన్యంగా కాపురం.. ఓ పాప.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్
Wife Protest
Follow us on

నెల్లూరులో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగింది. తనను ఇంటి నుంచి గేంటేశాడని భార్య శిల్ప నిరసన చేపట్టింది. శిల్ప కుటుంబసభ్యులు ఇంటికి వస్తున్నారనే సమాచారంతో భర్తతో పాటు అత్తింటివాళ్లంతా పరారయ్యారు. దీంతో శిల్ప కుటుంబమంతా ఇంటిముందే న్యాయపోరాటానికి దిగింది. న్యాయం జరిగేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శిల్ప-నిఖిల్‌లు మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి ఓ పాప. మొదట్లో బాగానే ఉన్న నిఖిల్‌ కొద్దిరోజులుగా శిల్పతో గొడపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లోంచి గెంటేశాడు. భర్త నిర్వాకంతో పుట్టింటికి వెళ్లిన శిల్ప తాజాగా తన బిడ్డతో పాటు అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. భర్త నిఖిల్ కులం పేరుతో ధూషిస్తూ ఇంట్లోంచి గెంటేశాడని కన్నీటిపర్యంతమవుతోంది శిల్ప. చిట్టీ డబ్బులు అడిగితే భార్య, అత్తమామలు వేధిస్తున్నారని ఆరోపించాడు భర్త నిఖిల్. ఇంత జరిగాక కాపురం చేసేది లేదన్నాడు.

 రూ.500, 1000కే హత్యలు..

తెలంగాణ నిజామాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన నేరాల గురించి తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. ఒక కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేయగా.. అతడు మరో రెండు హత్యలు చేసినట్లు నిర్ధారించారు. కేవలం 500, 1000 రూపాయలకు హత్యలకు పాల్పడినట్లు చెప్పడంతో షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ శివారులోని వైకుంఠధామం పక్కన.. ఈ నెల 5న ఓ మహిళ హత్యకు గురైంది. మృతురాలు మిట్టాపల్లికి చెందిన నర్సమ్మగా గుర్తించిన పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కమలాపూర్‌కు చెందిన మహమ్మద్ షారూఖ్‌ని అదుపులోకి తీసుకొని విచారించారు. వృద్ధురాలిని చంపినట్లు చెప్పిన నిందితుడు… మరో 3 హత్యలు చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మహమ్మద్‌ షారూఖ్‌.. డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ ఏరియాలో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం రైల్వే పట్టాల పక్కన పడుకునే.. సల్మాన్‌ఖాన్‌ అనే వ్యక్తిని హతమార్చి 500 రూపాయలు, చేతి గడియారాన్ని దొంగలించినట్లు  పోలీసులు తెలిపారు. ఆరు నెలల క్రితం ఘన్‌పూర్‌కు చెందిన షేక్​ మోసిన్‌తో కలిసి మద్యం తాగుతున్న సమయంలో తిట్టాడనే కోపంతో గ్రానైట్‌ రాయితో మోది హత్య చేశాడని వెల్లడించారు. మోసిన్‌ నుంచి 750 రూపాయలు దొంగిలించాడని పోలీసులు వెల్లడించారు. మద్యానికి బానిసై షారూఖ్‌ హత్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: యువతి అనుమానాస్పద మృతి.. ఇంట్లో నల్లటి మరకలు.. రంగంలోకి డీఎస్పీ ప్రశాంతి

మెదక్ కారు దగ్ధం కేసులో ముగ్గురి అరెస్ట్.. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు