ఏపీలోని కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్‌కు సమీపంలో కొప్పల నాగజ్యోతి అనే మహిళ ట్రాక్ దాటుతున్న సమయంలో ట్రైన్ ఢీ కొని మృతి చెందింది. మృతురాలు నాగజ్యోతి రాజంపేట మండలం హస్తవరం గ్రామానికి చెందినట్లుగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆమె మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా, నాగజ్యోతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నాగజ్యోతిని ఆమె భర్త చంపి అక్కడ పడేశాడని ఆరోపిస్తున్న ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. కాగా, మృతురాలు మూడు నెలల గర్భవతి అని తెలిపిన బంధువులు తెలిపారు.
నాగజ్యోతి భర్త బంధువులు, మృతురాలు బంధువులు పరస్పరం దాడులకు దిగారు. ఒకరి చొక్క ఒకరు పట్టుకుని ఘర్షణకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిజంగానే భర్త చంపేసి ట్రాక్‌పై పడేశాడా..? లేక రైలు ఢీకొనే మృతి చెందిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇరువర్గాలకు తెలిపారు.