గుంటూరు జిల్లాలో దారుణం.. మహిళపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్.. ఆపై..

| Edited By:

Feb 17, 2020 | 11:33 PM

దిశ చట్టం వచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. కామాంధుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట.. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌నకు ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రోజున బాధిత మహిళ.. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. […]

గుంటూరు జిల్లాలో దారుణం.. మహిళపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్.. ఆపై..
Follow us on

దిశ చట్టం వచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. కామాంధుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట.. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌నకు ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రోజున బాధిత మహిళ.. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ వివాహిత.. ఓ ఎడ్యుకేషన్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తోంది. అయితే ఇటీవల ఆమె తన స్కూటీపై వస్తున్న సమయంలో ఓ యువకుడికి లిఫ్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య కాస్త పరిచయం ఏర్పడింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా స్టడీ సర్టిఫికేట్‌లను ఇప్పస్తానని ఆమె యువకుడితో చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో సదరు యువకుడు.. ఈ నేపథ్యంలో ఆమెను ఆ యువకుడు మంగళగిరి మండలం చినకాకాని హాయ్‌ల్యాండ్‌ సమీపానికి రమ్మన్నాడు. అనంతరం తన స్నేహితులు మరో ఇద్దరు ఉన్నారని.. వారికి కూడా ఈ సర్టిఫికేట్స్ కావాలని చెప్తూ.. ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చాడు. అక్కడకు వెళ్లిన తర్వాత.. ఆ ముగ్గురు యువకులు వారి నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అప్పటి వరకు అమాయకంగా నటించిన వారు.. ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి.. విషయం బయటకు చెప్తే.. హతమారుస్తామంటూ బెదిరింపులకు దిగారు. అనంతరం ఆమెను అక్కడే వదిలి వెళ్లి పోవడంతో.. ఆమె తాడేపల్లి వెళ్లిపోయింది. ఈ ఘటనంతా.. ఫిబ్రవరి 15వ తేదీన జరిగింది. కాగా.. సోమవారం రోజు.. బాధితురాలు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.