ఖమ్మంలో కలకలం..సగం కాలిన స్థితిలో యువతి మృతదేహం

|

Jul 18, 2020 | 6:26 PM

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని యువతిని దుండగులు అతి దారుణంగా తగులబెట్టి చంపేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని

ఖమ్మంలో కలకలం..సగం కాలిన స్థితిలో యువతి మృతదేహం
Follow us on

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని యువతిని దుండగులు అతి దారుణంగా తగులబెట్టి చంపేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని బండ్రుగొండ నుంచి పూసుగూడెం వెళ్లే మార్గ మధ్యలో గల అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సగం కాలిపోయిన స్థితిలో కనిపించిన యువతి మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..యువతిని హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా ప్రాథమికంగా నిర్దారించారు. మంటల్లో యువతి ముఖం, శరీరం కాలిపోయి ఉండటంతో..గుర్తించటం కష్టంగా మారిందని చెప్పారు. మృతురాలి ఆచూకీ తెలియకూడదనే ముఖాన్ని కాల్చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు.