హైదరాబాద్ బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మహిళా ఎస్సైతో పాటు.. ఇద్దరు కానిస్టేబుల్స్‌పై దాడికి దిగింది. బంజరాహిల్స్‌లోని జహీరా నగర్ ప్రాంతంలో మద్యం మత్తులో లీసా అనే ఓ యువతి పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. దీంతో ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే మద్యం మత్తుదిగిన తర్వాత సదరు యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మహిళా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆ యువతి పోలీసులను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ముగ్గురు కానిస్టేబుల్స్‌పై దాడికి దిగింది. అడ్డొచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ చేతిని కొరికింది. మరో కానిస్టేబుల్ చున్నీ లాగేసి.. మెడపై రక్కింది. ఆ యువతి వివరాలు అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. అంతు చూస్తానంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది. ఎట్టకేలకు మిగతా పోలీసులు ఆ యువతిని పట్టుకుని కూర్చొబెట్టారు. చివరకు ఆ యువతి నాగాలాండ్‌కు వాసురాలిగా గుర్తించారు. నగరంలో మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు.