మద్యం మత్తులో కట్టుకున్న భార్యను దారుణంగా కొట్టాడు. ఆ దెబ్బలు తాళలేక ఆమె మృతి చెందింది. దీంతో ఏం చేయాలో తెలియక హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని పథకం రచించాడు. అనుకున్నట్లుగా మృతదేహాన్ని ట్రాక్టర్ లో వేసుకుని, రోడ్డుపై పడేయాలని భావించాడు. పథకం ప్రకారం మృతదేహాన్ని తీసుకెళ్తుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. దగ్గరికెళ్లి చూడగా.. ట్రాక్టర్ లో అతని భార్య మృతదేహం ఉంది. డెడ్ బాడీ గురించి నిలదీశారు. దీంతో తానే కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులుతండాకు చెందిన జాటోత్ మణమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల్లో.. మణమ్మను భర్త స్వామి కొట్టి చంపినట్లు గ్రామస్థులు ఆరోపించారు. మేడారం సమ్మక్క- సారలమ్మ పండుగ చేసుకున్న అనంతరం, అదే రోజు అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నారు. మద్యం మత్తులో ఉన్న స్వామి మణమ్మను తీవ్రంగా కొట్టాడని, భర్త దాడిలో ఆమె తలకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. గాయాలను తాళలేక మణమ్మ మృతి చెందిందని, మృతదేహాని ట్రాక్టర్లో తీసుకెళ్తుండగా చూశామని వెల్లడించారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నాడని భావించారమని, కానీ.. కొద్దిసేపటికే రోడ్డుపై పడేశాడని చెప్పారు. దీంతో ట్రాక్టర్ను ఆపి మణమ్మను చూడగా అప్పటికే ఆమె మృతి చెందిందని గ్రామస్థులు అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
AP Crime: చిచ్చు రేపిన ఆర్థిక విభేదాలు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య.. భర్త మృతిని తట్టుకోలేక..
Crime: కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి ఘాతుకం.. భార్య, మరో ఇద్దరు కూతుర్లని చంపేసి
Andhra Style Fish Curry: ఆంధ్ర స్టైల్‌లో ఈజీగా టేస్టీగా చేపల కూర తయారీ..