Telangana: ఆ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణంగా చంపింది.. చివరకు ప్రియుడితో కలిసి

|

May 30, 2022 | 3:16 PM

ఆమె కొంతకాలంగా మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై భార్య భర్తలిద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు.

Telangana: ఆ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణంగా చంపింది.. చివరకు ప్రియుడితో కలిసి
Crime News
Follow us on

Wife kills husband: ఇష్టంతో పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత అక్రమ సంబంధానికి అలవాడుపడింది.. ఈ క్రమంలో భర్తనే చంపుదామని ప్లాన్ వేసి.. భార్య రోకలిబండతో కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లాలోని గన్నేరువరం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుండ్లపల్లిలో ఓ మహిళ కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్యచేసింది. గుండ్లపల్లికి చెందిన పెనుగొండ లక్ష్మి, వెంకట్‌రెడ్డి భార్యాభర్తలు. అయితే కొంతకాలంగా లక్ష్మి మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంపై భార్య భర్తలిద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో తనకు అడ్డుగా ఉన్న వెంకట్‌రెడ్డిని హత్యచేయాలని భార్య నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రోకలిబండతో వెంకటరెడ్డిని కొట్టి చంపింది. అనంతరం బాధితుడి మృతదేహాన్ని ప్రియుడు వెంకటస్వామి సాయంతో హుస్నాబాద్‌ పొట్లపల్లి వాగులో ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టింది.

అయితే వెంకట్‌రెడ్డి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు గన్నేరువరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులు పెనుగొండ లక్ష్మి, వెంకటస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..