Gun Fire: శుభకార్యాల్లో పెచ్చుమీరుతున్న గన్ కల్చర్.. వివాహ వేడుకలో విషాదం.. వరుడి సోదరుడు మృతి

|

Jul 03, 2021 | 8:40 AM

Groom’s Cousin Shot Dead: ఉత్తరాదిలో గన్‌ కల్చర్‌కు ముగింపు పడటం లేదు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా.. కొంతమంది తుపాకులతో వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా

Gun Fire: శుభకార్యాల్లో పెచ్చుమీరుతున్న గన్ కల్చర్.. వివాహ వేడుకలో విషాదం.. వరుడి సోదరుడు మృతి
Gun Fire
Follow us on

Groom’s Cousin Shot Dead: ఉత్తరాదిలో గన్‌ కల్చర్‌కు ముగింపు పడటం లేదు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా.. కొంతమంది తుపాకులతో వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా మారుతోంది. ఈ క్రమంలో కాల్పులు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. సరదాగా సాగిపోతున్న వివాహ వేడుకలో విషాదకర సంఘటన జరిగింది. పెళ్లికి హాజరైన పదో తరగతి విద్యార్థి అనూహ్యంగా మృతిచెందాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఖండౌలి ప్రాంతంలో జరిగింది. వివరాలు.. గురువారం ఖండౌలి ప్రాంతంలో వివాహ కార్యక్రమం జరుగుతోంది. పెళ్లికి వచ్చిన ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి తన వెంట లైసెన్స్‌డ్‌ గన్‌​ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో వివేక్‌ అనే యువకుడు.. ఓసారి గన్‌ చూస్తానని ఆర్మీ అధికారిని కోరాడు.

అయితే ఆ గన్‌ లోడ్‌ చేసి ఉండటంతో.. వివేక్‌ అనుకోకుండా ట్రిగ్గర్‌ నొక్కాడు. దాంతో ఒక బుల్లెట్‌ ఒక్కసారిగా అక్కడ ఉన్న ధర్మేంద్ర సింగ్‌ (16) ఛాతీలోకి దూసుకెళ్లింది. వెంటనే ధర్మేంద్ర సింగ్ కుప్పకూలాడు. బంధువులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. అప్పటివరకు సందడిగా ఉన్న పెళ్లి వేడకలో ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఇది అనుకోకుండా జరగిన ఘటన కాదని, కావాలనే తమ బిడ్డను చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పలువురి నుంచి వివరాలు సేకరించారు.

Also Read:

Tirath Singh Rawat: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామా.. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వకపోవడంతో..

Horoscope 3 July 2021:ఆర్ధికంగా లాభం చేకూరాలంటే.. ఈ రోజు ఏయే రాశులవారు ఏ దేవతలు పూజించాలంటే