Rape Attempt: మహిళా రోగిపై వార్డుబాయ్‌ అత్యాచారయత్నం… విద్యానగర్‌ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో దారుణం

మహిళలకు బయటే కాదు.. ఆస్పత్రుల్లో కూడా రక్షణ లేకుండా పోయింది. బెడ్‌ మీద చికిత్స తీసుకుంటున్న రోగులను కూడా కామాందులు వదలడం లేదు. హైదరాబాద్‌లో నగరం నడిబొడ్డున ఉన్న ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది.పేషెంట్‌పై అత్యాచారయత్నం చేశారు వార్డ్ బాయ్. మహిళా అరుపులతో...

Rape Attempt: మహిళా రోగిపై వార్డుబాయ్‌ అత్యాచారయత్నం... విద్యానగర్‌ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో దారుణం
Durgabai Deshmukh Hospital

Updated on: Jul 14, 2025 | 12:37 PM

మహిళలకు బయటే కాదు.. ఆస్పత్రుల్లో కూడా రక్షణ లేకుండా పోయింది. బెడ్‌ మీద చికిత్స తీసుకుంటున్న రోగులను కూడా కామాందులు వదలడం లేదు. హైదరాబాద్‌లో నగరం నడిబొడ్డున ఉన్న ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది.పేషెంట్‌పై అత్యాచారయత్నం చేశారు వార్డ్ బాయ్. మహిళా అరుపులతో వెంటనే అప్రమత్తయ్యారు సిబ్బంది. విద్యానగర్‌లోని ఆంధ్రా మహిళా సభ ఆస్పత్రిలో చోటు చేసుకుంది ఈ దారుణం.

మహిళా పేషెంట్‌పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాధితురాలి కేకలతో బంధువులు అప్రమత్తమయ్యారు. వార్డ్ బాయ్‌ని చితకబాదారు బాధితురాలి కుటుంబ సభ్యులు. అనంతరం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేడయంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆస్పత్రిలో అత్యాచారయత్నానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.