విషాదం.. పాఠం చెబుతూనే.. ప్రాణం విడిచిన మాస్టర్..

ఆయన రోజూలాగే క్లాస్‌లో  పాఠం చెబుతున్నారు. స్టూడెంట్స్‌ కూడా శ్రద్దగా వింటున్నారు. కానీ ఉన్నట్టుంది ఒక్కసారిగా కుర్చీలో..కూలబడిపోయి అలానే ప్రాణాలు విడిచారు.  మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తరగతిగదిలో పిల్లలకు పాఠాలు చెబుతుండగా ..గుండెపోటు రావడంతో మరణించారని డాక్టర్లు నిర్ధారించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వేటికట్ట ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల హెడ్ మాస్టర్ డి.విజయ్ సింగ్ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు క్లాస్‌రూమ్‌కి వెళ్లారు. విద్యార్థులకు పాఠం చెబుతుండగా కుప్పకూలిపోయారు. హెడ్ […]

విషాదం.. పాఠం చెబుతూనే.. ప్రాణం విడిచిన మాస్టర్..

Edited By:

Updated on: Oct 28, 2019 | 6:11 PM

ఆయన రోజూలాగే క్లాస్‌లో  పాఠం చెబుతున్నారు. స్టూడెంట్స్‌ కూడా శ్రద్దగా వింటున్నారు. కానీ ఉన్నట్టుంది ఒక్కసారిగా కుర్చీలో..కూలబడిపోయి అలానే ప్రాణాలు విడిచారు.  మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తరగతిగదిలో పిల్లలకు పాఠాలు చెబుతుండగా ..గుండెపోటు రావడంతో మరణించారని డాక్టర్లు నిర్ధారించారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వేటికట్ట ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల హెడ్ మాస్టర్ డి.విజయ్ సింగ్ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు క్లాస్‌రూమ్‌కి వెళ్లారు. విద్యార్థులకు పాఠం చెబుతుండగా కుప్పకూలిపోయారు. హెడ్ మాస్టర్ అలా కుప్పకూలిపోవడం చూసి కంగారు పడిన విద్యార్థులు వెంటనే టీచర్లకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికే ఆయన ప్రాణాలు విడిచారు. అప్పటివరకు తమకు పాఠం చెప్పిన మాస్టారు అలా నిర్జీవంగా ఉండటం చూసి విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us