Crime News: వరంగల్‌లో డ్రగ్స్ కలకలం.. తొలిసారిగా కోకైన్, చరస్‌ మత్తు పధార్థాలు సీజ్!

|

Nov 06, 2021 | 7:26 AM

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వరంగల్‌లో అకస్మాత్తుగా అలజడి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి.

Crime News: వరంగల్‌లో డ్రగ్స్ కలకలం.. తొలిసారిగా కోకైన్, చరస్‌ మత్తు పధార్థాలు సీజ్!
Warangal Drugs
Follow us on

Warangal Drugs Seized: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వరంగల్‌లో అకస్మాత్తుగా అలజడి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ కమిషనరేట్‌ పరిధిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీంతో ఉలిక్కిపడ్డారు ఓరుగల్లు ప్రజలు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరం వరంగల్. విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది ఓరుగల్లు. అలాంటి ట్రై సిటీ, ఇప్పుడు వార్తాల్లోకెక్కింది. దీంతో ఒక్కసారిగి ఉలిక్కిపడ్డారు వరంగల్ వాసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా కోకైన్, చరస్‌తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్ముతున్న ఇద్దరు పట్టుబడ్డారు. వాటిని సేవిస్తున్న మరో నలుగురు యువకులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు.

వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు. వారి నుంచి 3 లక్షల 16 వేల రూపాయల విలువైన ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు, మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడిగా చేసే పరికరం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇవే కాకుండా ఒక హుక్కా కూజాతో పాటు దానికి వినియోగించే సామాగ్రి, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో, టాస్క్‌ఫోర్స్, సుబేదారి పోలీసులు నక్కలగుట్టలోని ఓ లాడ్జ్‌పై దాడులు నిర్వహించారు. మత్తు పదార్థాలు సేవిస్తున్న ఆరుగురు యువకులను అదుపులో తీసుకోని విచారించగా, అసలు విషయం బయటపడింది. పోలీసులు అరెస్టు చేసిన యువకులందరు స్నేహితులని తేలింది. వీరందరు చదువుకునే సమయంలోనే మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారని గుర్తించారు పోలీసులు.

పట్టుబడినవారంతా మూడేళ్ళుగా వీరందరు మత్తు పదార్థాలను వినియోగిస్తున్నారని వరంగల్ వెల్లడించారు. అరెస్టైన వారిలో ఒకరు తరుచుగా గోవాకు వెళ్లి, నైజీరియాకు చెందిన వారిని మీట్ అవుతారని చెప్పారు పోలీసులు. వారితో ఉన్న పరిచయంతో కొకైన్, చరస్, ఇతర మత్తు పదార్థాలను కొనుగోలు చేసేవాడని తెలిపారు వరంగల్ పోలీసులు. ఆ మత్తుపదార్థాలను తన స్నేహితులకు అమ్మేవాడని, స్థానికంగా ఉన్న లాడ్జ్‌ల్లో మత్తు పదార్థాలను సేవించేవాడని వివరించారు అధికారులు. తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోకైన్ లాంటి మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. దీంతో ఇతర ప్రాంతాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

Read Also…  Sadar Mela: హైదరాబాద్‌లో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.. ఖైరతాబాద్ చౌరస్తాలో పరుగులు పెట్టిన దున్నపోతు