Virinchi : విరించి హాస్పిటల్ నిర్వాకం, 9 రోజుల ట్రీట్మెంట్ తర్వాత చనిపోయిన రోగి.. 20 లక్షల బిల్లు.. అదేమంటే.!

|

May 27, 2021 | 6:38 PM

Virinchi Hospital : హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్ బాగోతం బట్టబయలైంది...

Virinchi : విరించి హాస్పిటల్ నిర్వాకం, 9 రోజుల ట్రీట్మెంట్ తర్వాత చనిపోయిన రోగి..  20 లక్షల బిల్లు.. అదేమంటే.!
Hyderabad Virinchi Hospital
Follow us on

Virinchi Hospital : హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్ బాగోతం బట్టబయలైంది. శవాలపై కాసులు ఏరుకుంటున్న చందంగా మారింది విరించి హాస్పిటల్ తీరు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండి విరించి హాస్పిటల్ లో ఒక వ్యక్తి చేరగా, 9 రోజుల ట్రీట్మెంట్ తర్వాత సదరు వ్యక్తి చనిపోయాడంటూ డాక్టర్లు చావుకబురు చల్లగా చెప్పారు. అంతేకాదు, 20 లక్షలు బిల్లు కట్టండని అడిగారు. అయితే, పేషంట్ చెల్లి డాక్టర్ కావడంతో హాస్పిటల్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తన తమ్ముడుకి కేవలం జ్వరం వచ్చిందని హాస్పిటల్ లో చేర్పిస్తే వాడికెందుకు ఒక గ్రాము స్టెరాయిడ్స్ ఇచ్చారని ఆమె డాక్టర్లను నిలదీశారు. తాను కట్టిన డబ్బు ఎందుకు రిఫండ్ ఇవ్వాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాయి. ఈ క్రమంలో రూపాయి కూడా కట్టకండి… బాడీ తీసుకెళ్లండి అంటూ విరించి హాస్పిటల్ బేరసారాలకి దిగింది. ఈ నేపథ్యంలో బంధువులతో కలిసి మృతుడి సోదరి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఒక దశలో హాస్పిటల్ పై మృతుడి బంధువుల దాడికి దిగి… ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు.

Read also : Bhumana : అమ్మాయిలకు సైతం మత్తు అలవాటు చేసి.. వల్లో వేసుకుని పశు వాంఛ తీర్చుకుంటున్నారు : భూమన పోలీస్ కంప్లైంట్