Girls Street Fight: అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం.. లేదంటే అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడటం లాంటి సీన్స్ సినిమాలో బోలెడు ఉన్నాయి. స్టోరీ లైనప్‌ను బట్టి అలాంటి సీన్స్ ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తాయి.. కానీ సేమ్ టూ సేమ్ అదే సీన్.. రియల్‌గా జరిగితే ఇదిగో ఇలాగే ఉంటది. ఇక్కడ చూడండి.. సుమారు పది మంది వరకూ అమ్మాయిలు ఉన్నారు. బ్యాగులు తగిలించుకున్న వీళ్లను చూస్తే కాలేజీ అమ్మాయిలని ఇట్టే తెలిసిపోతుంది. కాలేజీ అమ్మాయిలంటే బుద్ధిగా క్లాసులకు వెళ్లి.. తిరిగి ఇంటికి రావాలి. కానీ ఇక్కడ వీళ్లు జుట్టు, జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. పక్కన వాళ్లు విడిపిస్తున్నా ఆగకుండా.. నడిరోడ్డు మీదే చెడా మడా కొట్టుకున్నారు. వీళ్లకేమీ గట్టు పంచయతీలు లేవు.. ఇంటి దగ్గర తగాదాలు అంతకంటే కాదు. ఓ అబ్బాయి కోసం ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. తమిళనాడులోని చెన్నై మహానగరం నడిబొడ్డున ఈ ఘటన జరిగింది.
ఒకే కాలేజీలో చదివే ఇద్దరు అమ్మాయిలు.. ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆ విషయం వాళ్లి్ద్దరికీ చాలా లేట్‌గా తెలిసింది. వాడు నా వాడు అంటే నా వాడు అంటే ఇద్దరూ వాదులాడుకున్నారు. నువ్వు మర్చిపోవాలంటే.. నువ్వే మర్చిపో అంటూ ఘర్షణకు దిగారు. అది కాస్తా శృతి మించడంతో ఇలా రోడ్డు మీదే తన్నుకున్నారు. అక్కడున్న తోటి విద్యార్ధులు ఈ ఫైటింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది.