Volunteer Murder in Anantapuram: అనంతపురంలో దారుణం చేటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు వాలంటీర్‌ను కిరాతకంగా హత్యచేశారు. ఈ సంఘటన జిల్లాలోని కూడేరు మండలంలోని శివరాంపేటలో జరిగింది. శుక్రవారం రాత్రివేళ పొలం వద్ద నిద్రిస్తున్న శివరాంపేట గ్రామానికి చెందిన వాలంటీర్ శ్రీకాంత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఈ క్రమంలో ఉదయం వేళ అటుగా వెళ్తున్న కొందరు శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి వేళ గునపంతో పొడిచి హత్య చేసినట్టు పేర్కొంటున్నారు. అయితే.. శ్రీకాంత్ తండ్రికి పలువురితో విబేధాలున్నాయి. దీంతో శ్రీకాంత్ తండ్రిని చంపబోయి ఆయన కుమారుడిపై దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: